దుగ్గిరాల ఇంట్లో జరిగే వరలక్ష్మీ వ్రతం బాధ్యతలు ఈసారి అపర్ణ కోడలు కావ్యకి అప్పగిస్తున్నట్టు ఇంద్రాదేవి అందరికీ చెప్తుంది. ఆ మాటకి అపర్ణ కోపంతో రగిలిపోతుంది. ఇక రాజ్ కూడా వ్రతం నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. అటు స్వప్న తన ప్రెగ్నెన్సీ విషయం బయట పడకుండా లక్కీగా తప్పించుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో ప్రకారం మళ్ళీ అత్తాకోడళ్ల మధ్య అగ్గి రగులుకుంది.
ప్రోమోలో ఏముందంటే..
కావ్య కిచెన్ లో ఉండగా అపర్ణ వెళ్తుంది. తనని ఎదిరించి తన కొడుకు వ్రతంలో కూర్చోడు అన్నట్టు ధీమాగా మాట్లాడుతుంది.
అపర్ణ: ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చింది. ఇంటి పెద్దలు నిన్నొక మనిషిలా గుర్తిస్తున్నారు. నువ్వు ఈ ఇంట్లో తిరుగుతుంటే చూసి సహించలేను. అంటే కావ్య వ్రతానికి సంబంధించి ఏదో సవాలు విసిరినట్టుగా ఉంది. వాడు నా కొడుకు నువ్వు నాతో తిరగబడి మాట్లాడినందుకు ఇంటి ముందు నిలబెట్టి తలుపులు మూశాడు. ఇక నాతో సవాలు చేస్తే ఊరుకుంటాడా?
Also Read: లాస్యకి అదిరే ఝలక్ ఇచ్చిన లక్కీ- నందు ఆవేదన, తులసి ఆక్రోశం
కావ్య: మీ అబ్బాయ్ మీ మనసు మార్చొచ్చు ఏమో
అప్పుడే కావ్య గదిలోకి వెళ్తుంటే రాజ్ ఎదురుపడతాడు. వ్రతం నువ్వు చెయ్యి ఫలితం నేను ఇస్తానని మాట ఇస్తాడు. ఏం చేస్తారని కావ్య అడుగుతుంది. కానీ రాజ్ మాత్రం వెయిట్ అండ్ సీ అనేసి వెళ్ళిపోతాడు.
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్యకి అత్త వేసిన శిక్ష గురించి అందరికీ ఇంద్రాదేవి చెప్పేస్తుంది. ఇక స్త్రీ సంఘం వాళ్ళు రాజ్, కావ్యకి సన్మానం చేస్తారు. కళావతి సంతోషంగా మొగుడు చేతిని పట్టుకుని మరీ ఫోటో దిగి ఆనందపడుతుంది. కావ్య చేసిన మంచి పని ఇంట్లో కొంతమందికి నచ్చలేదు కానీ అదే ఈ కుటుంబానికి పేరు తీసుకొచ్చిందని శుభాష్ అపర్ణకి తగిలేలా సెటైర్ వేస్తాడు. అటు హాస్పిటల్ లో స్వప్న తన దొంగ కడుపు ఎక్కడ తెలిసిపోతుందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెళ్లిపోదాం హాస్పిటల్ వాతావరణం పడటం లేదని నచ్చజెప్పి రుద్రాణి వాళ్ళని తీసుకెళ్లబోతుంటే డాక్టర్ పిలుస్తున్నారని చెప్తారు. ఇంత సేపు వెయిట్ చేశాం కదా చెక్ చేయించుకుని వెళ్లిపోదామని రుద్రాణి స్వప్నని డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్తుంది.
Also Read: కృష్ణకి సర్‌ప్రైజ్, ముకుందకి షాక్ - రేవతినా మజాకా!
ఆ డాక్టర్ ఎవరో కాదు గతంలో స్వప్న కళ్ళు తిరిగి పడిపోతే ఇంటికి వచ్చి చెక్ చేసిన ఆమె. దీంతో తనని చూడగానే స్వప్నకి ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. అదే విషయాన్ని డాక్టర్ కి గుర్తు చేసి కడుపులో బిడ్డకి ఏం కాలేదని చెప్పిస్తుంది. అలా మరోసారి ఎస్కేప్ అవుతుంది. అనామిక కళ్యాణ్ కి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడు. మళ్ళీ మళ్ళీ చేయడంతో లిఫ్ట్ చేసి డల్ గా మాట్లాడతాడు. కాసేపు ఊరించి ఊరించి పెళ్లి కాలేదని అనామిక చెప్పేసరికి కళ్యాణ్ సంతోషపడిపోతాడు. రెస్టారెంట్ దగ్గర కళ్యాణ్ ని డ్రాప్ చేసిందని తనేనని అనామిక చెప్పేసరికి షాక్ అవుతాడు. తర్వాత తను పంపించిన గిఫ్ట్ ఎలా ఉందని అడుగుతుంది. దాని కోసం ఇల్లంతా వెతుకుతాడు. చివరికి అది దొరికితే కావ్య ఓపెన్ చేసి చూస్తుంది. కళ్యాణ్ కవితలు రాసి బాగా రాలేదని చింపేసిన పేపర్స్ అన్నీ ఒక బుక్ గా తయారు చేయించి అనామిక గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసి ఇంట్లో అందరూ సంతోషపడతారు. దుగ్గిరాల ఇంట్లో కవి పుట్టాడని మెచ్చుకుంటారు. ఇక గిఫ్ట్ బాక్స్ మీద పజిల్ రాసి దాని ప్రకారం కలవమని అనామిక హింట్ ఇస్తుంది. అది చదివి ఎక్కడికి వెళ్లాలో కావ్య చెప్తుంది.