అషు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తనకు మర్చిపోలేని గిఫ్ట్ లభించింది. తన తండ్రి మెర్సిడెజ్ జీఎల్‌సీ 200డీ మోడల్ కారును తనకు బహుమతిగా అందించారు. ఈ కారు ఎక్స్-షోరూం ధర రూ.73.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అన్నీ ట్యాక్స్‌లు, యాక్సెసరీస్ కలుపుకుంటే రూ.90 లక్షల వరకు దీని ధర ఉండే అవకాశం ఉంది. గురువారం (సెప్టెంబర్ 15వ తేదీ) తన పుట్టినరోజు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తన ఫాలోవర్స్‌తో ఆనందాన్ని పంచుకుంది.
తండ్రితో కలిసి కారు ముందు దిగిన ఫొటోలు అషు తన ఇన్‌స్టాలో పంచుకుంది.‘సారీ మమ్మీ.. నువ్వు షాకవ్వకు. ఇది డాడీ సర్‌ప్రైజ్’ అనే క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ఈ ఖరీదైన కారును కానుకగా అందుకున్న అషు బాగా సర్‌ప్రైజింగ్‌గా ఫీల్ అవుతున్నాని తెలిపింది. ‘ఈ సంవత్సరం నేను అందుకున్న సర్ ఫ్రైజ్ బహుమతి ఇది’ అంటూ మురిసిపోయింది. ఇక ఆమె పోస్ట్‌పై తన ఫాలోవర్స్ అషు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బిగ్‌బాస్ షోతో స్టార్‌డమ్ తెచ్చుకున్న ఆషు రెడ్డి తరచూ తన హాట్ ఫొటోలతో ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. బిగ్ బాస్ షోకి ముందే నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ‘ఛల్ మోహన్ రంగా’ సినిమాలో కూడా అషు నటించింది. కామెడీ స్టార్స్ టీవీ షోలో కూడా తను పెర్ఫార్మ్ చేస్తుంది.