Prema Entha Madhuram October 9th: అభయ్​కి మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేసిన దృశ్యాన్ని అనుకి చూపిస్తాడు జలంధర్.


అను: ప్లీజ్ కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను, అభయ్​ని ఏం చేయొద్దు.


జలంధర్: ఆగు నువ్వు ఇక్కడే ఉండాలి. నా చెల్లితో నీ భర్త పెళ్లి చూడాలి ఇలా వెక్కివెక్కి ఏడ్వాలి. అప్పుడే నీ కొడుకుని నీకు ఇస్తాను. నీ ఏడుపే నా చెల్లికి అక్షంతలు అని ఆ పెళ్లి జరుగుతున్న పీటల పక్కన ఉన్న జనాల మధ్య ముసుగు వేసుకున్న అనుని నిలబెట్టిస్తాడు జలంధర్.


అను: ఏంటి దేవుడా నాకు ఈ కర్మ? నా సొంత భర్త పెళ్లిని నా కళ్లముందే చూపించేలా చేస్తున్నావని వెక్కి వెక్కి ఏడుస్తుంది అను.


పూజారి: గణపతి పూజ అయింది. వధూవరులు ఇద్దరు వెళ్లి పెళ్లి దుస్తులలో తయారవ్వండని అంటే.. ఆర్య, ఛాయ దేవిలు ఇద్దరూ వాళ్ల వాళ్ల గదులలోకి వెళ్తారు.


పద్దు: చూశావా సుబ్బు ఆర్కే సార్​కి మన ప్రాణాలు అన్నా కూడా విలువలేదు.


సుబ్బు: ప్రాణం కన్నా ప్రేమించిన మన అమ్మినే మర్చిపోయినప్పుడు మన ప్రాణాలు లెక్కేంటి చెప్పు పద్దు


పద్దు: నిజంగా ఈ పెళ్లేగాని జరిగితే మన శవాలే ఈ పెళ్లికి బహుమతులు అవుతాయని అంటుంది.


ఆ తర్వాత సీన్లో ఆర్య తన గదిలోకి వచ్చి సుబ్బు, పద్దులతో జరిగిన సంభాషణని అంతా గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.


జెండే: బాధపడొద్దు ఆర్య నిజం తెలుసుకున్న తర్వాత వాళ్లు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు.


ఆర్య: అదే అనుకుంటున్నాను జెండే ఇంతకీ రోహిత్ ఎక్కడ? అని అడుగుతాడు ఆర్య.


ఆ తర్వాత సీన్​లో మాన్సి, ఛాయాదేవిని పెళ్లికూతురు ముస్తాబులో తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జలంధర్ వస్తాడు.


ఛాయాదేవి: అవునన్నయ్య నేను ఇందాక కూడా అడుగుదామనుకున్నాను కానీ ఆ సుబ్బు, పద్దుల గోలలో ఆగిపోయాను. ఇంతకీ ఆర్య ఎందుకు ఆ పూలదండతో ముఖాన్ని కప్పుకున్నాడు?


జలంధర్: ఇందాక వాళ్లు చేసిన గొడవలాగే ఇంకా చాలామంది చేస్తారు అని ఇలా చేశాడు. అందుకే నాకు అనుమానం వచ్చి నీ వద్దకు రాకముందే పూలవెనుక మొఖం చూసి నీ దగ్గరకు పంపించాను.


మాన్సి: మోసం చేసే ప్లాన్ వేస్తే మనం వేయాలి కాని వాళ్లు వేయరు. ఆ తర్వాత సీన్లో పెళ్లికూతురు పెళ్లికొడుకు ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చుంటారు.


అంజలి: పెళ్లి జరిగిపోతుంది నీరజ్ ఏదైనా చెయ్యు ప్లీజ్.


నీరజ్: దాదా అంత మాట అన్న తర్వాత నేనేం చేయలేను అంజలి. ఐ యాం హెల్ప్ లెస్.


అను: దేవుడా దయచేసి నువ్వే ఈ పెళ్లి ఆపేలా చేయవా. నేను ఆపుదాం అన్నా సరే నా బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉంది. 


పూజారి: వరుడు వధువు మెడలో తాళి కట్టాలి అని అనగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళి కడతాడు.


మరుక్షణమే సుబ్బు, పద్దులు విషం తాగుదాం అనగా అంజలీని, నీరజ్​లు వాళ్లని ఆపుతారు.


పద్దు: ఇంక నేను ఏం చూడాలి? ఏం చేయగలను? నా కళ్లముందే ఇంత ఘోరం జరిగిపోయింది. మా మమ్మీకి అన్యాయం జరిగిపోయింది.


సుబ్బు: ఇంక ఈ ప్రాణాలు ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే. ఆ సమయంలో పెళ్లి బాగా జరిగిందా అని మేడపై నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. అందరూ అటువైపు చూసి నోరెళ్ల పెట్టేస్తారు. ఆర్యని చూసిన అను ఆనందంతో ఏడ్చేస్తుంది.


ఛాయాదేవి: ఆర్య?? నువ్వు అక్కడ ఉంటే మరి ఇక్కడ ఉన్నదెవరు అని పక్కనే ఉన్న పూల ముసుగుని పైకి తీయగా అక్కడ రోహిత్ ఉంటాడు. మోసం!! ఈ పెళ్లి అంతా మోసం. అబద్ధం అని గట్టిగా అరుస్తుంది ఛాయాదేవి.


ఆర్య: షట్ అప్. మోసం చేసింది నువ్వు. ప్రేమిస్తున్నాను అని చెప్పి రోహిత్ ఆస్తి కాజేసి మోసం చేసింది నువ్వు.


Join Us On Telegram: https://t.me/abpdesamofficial