Ammayi garu Serial Today Episode రాజు, రూపలు కోమలి, అశోక్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఇంటికి తీసుకొస్తారు. రాజు అశోక్‌కి ఈడ్చుకు రావడం చూసి అందరూ షాక్ అవుతారు. విజయాంబిక, దీపక్‌లు బిత్తరపోతారు. వీడు మళ్లీ దొరికిపోయాడా మన పని అయిపోతుందేమో మమ్మీ అని దీపక్ విజయాంబికతో అంటాడు.

సూర్యప్రతాప్‌ రాజుతో ఎవరు వీడు అని అడిగితే ఇన్ని రోజులు మనం వెతుకుతున్న దొంగ పెద్దయ్య.. బంటీ భర్త్‌డేలో వెయిటర్‌లా వచ్చి డబ్బు తీసుకోవాలని చూసించి వీడే.. తర్వాత భూమి పూజలో బాంబ్ బ్లాస్ట్ చేసింది వీడే పెద్దయ్యా అని రాజు చెప్తాడు. కోమలి చాలా భయపడుతుంది. వీడిని పోలీసులకు అప్పగిద్దాం వీడి దగ్గర నుంచి పోలీసులు నిజం రాబడితే వీడి వెనక ఎవరు ఉన్నారు.. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తెలుస్తుందని రాజు అంటాడు. చంద్ర రాజుతో వీడు దొంగ అని మనకి తెలుసు కానీ కోర్టుకి ఆధారాలు కావాలి కదా అవి ఉన్నాయా అంటే ఉన్నాయి చిన్నయ్య అని రాజు చెప్తాడు. కోమలి, విజయాంబిక, దీపక్ చాలా టెన్షన్ అయిపోతారు.

రాజు సీసీ టీవీ ఫుటేజ్ ఉందని చెప్పి ల్యాప్‌టాప్ తెచ్చి చూసే సరికి ఫుటేజ్ అందులో ఉండదు. కోమలి ఊరిపి పీల్చుకుంటుంది. సాక్ష్యాలు అన్నీ ఎవరో డిలీట్ చేసేశారని రాజు అంటాడు. సాక్ష్యాలు లేకుండా అలా ఎలా అరెస్ట్ చేస్తారు. మీ అల్లుడు చెప్తే అరెస్ట్ చేసేస్తారా నా దారిన పోతే ఇలా ఈడ్చుకొచ్చి కొట్టారు కూడా నాకు జరిగిన అవమానం సంగతి ఏంటి ఇప్పుడు సాక్ష్యాలు కూడా లేవు.. ఇదే అవమానం మీకు జరిగితే ఒకేనా అని అశోక్ అంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్‌రా సీసీ టీవీ ఫుటేజ్ లేదు కాబట్టి తప్పించుకున్నావ్ లేదంటేనా అని చంద్ర అంటే.. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా తప్పించుకోలేడు అని చెప్పి అశోక్‌ని పంపేస్తాడు. కోమలి రిలాక్స్ అయిపోతుంది. 

రాజు, రూప చాలా బాధ పడతారు. విరూపాక్షి కూతురు అల్లుడితో ఇద్దరినీ పట్టించాల్సింది.. ఇద్దరూ మాట్లాడుతుంటే వీడియో అయినా తీయాల్సిందని అంటుంది. అశోక్‌ని నాలుగు తంటే మొత్తం చెప్తాడని అనుకున్నా కానీ ఏం చేయలేకపోయాను అని రాజు అనుకుంటాడు. సీసీ టీవీ ఫుటేజ్ ఎలా మిస్ అయిందని రూప అడుగుతుంది. అదే అర్థం కాలేదని రాజు అంటాడు. విజయాంబిక, దీపక్‌లతో కోమలి నేనే డిలీట్ చేశానని చెప్తుంది. అశోక్‌ని అసలు నువ్వు ఎందుకు కలిశావ్ అని దీపక్ అడుగుతాడు. అశోక్‌తో కలవడంమాట్లాడటం నా పర్సనల్ అది నా మేటర్ నువ్వు మాట్లాడకు అని అంటుంది. రూప గురించి మాత్రమే నువ్వు మాట్లాడు అని అంటుంది. 

రాఘవని కాపాడుకుంటే అన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయని విరూపాక్షి అంటుంది. విజయాంబిక దీపక్, కోమలితో రాఘవని చంపేస్తే మనకు ఇక ఏ అడ్డు ఉండదు.. అలా అయితే ఈ జన్మలో విరూపాక్షి నిజం నిరూపించుకోలేదు అని అంటుంది. దీపక్ కొంచెం రిస్క్ చేసి అయినా రాఘవని చంపేయాలని అంటాడు. విరూపాక్షి రాజు వాళ్లతో సూర్య ముందే రాఘవని చంపాలనుకున్న విజయాంబిక సెక్యూరిటీని అస్సలు పట్టించుకోదు.. మనమే రాఘవని కాపాడుకోవాలని విరూపాక్షి అంటుంది. దీపక్, విజయాంబిక హాస్పిటల్‌కి వెళ్తారు. విజయాంబిక దీపక్‌కి ఓ ఇంజక్షన్ చూపించి అది స్లో పాయిజిన్ అది వాడికి వేసిన 24 గంటల తర్వాత చస్తాడు కాబట్టి మనకు ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పిలోపలికి వెళ్తుంది. సెక్యూరిటీ విజయాంబిక వాళ్లని అడ్డుకుంటారు. విజయాంబిక, దీపక్ వాళ్లని బెదిరించి వెళ్తుంటే సెక్యూరిటీ ఆపి కాల్ చేసి అడిగి అప్పుడు పంపిస్తామని చెప్పి కాల్ చేస్తారు. కాల్ కలవకపోవడంతో వెయిట్ చేయమని చెప్తారు. ఇప్పుడు కాదులే అని విజయాంబిక వాళ్లు పక్కకి వెళ్లిపోతారు.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.