Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ ఇంటికి పింకీ లవర్ గోపీ వస్తాడు. పింకీ గోపీ దగ్గరకు వెళ్లి ఏంటి ఈ సడెన్ సర్‌ప్రైజ్ అని అడుగుతుంది. నీ కోసమే వచ్చానని చెప్పిన గోపీ పింకీ చేతికి ఓ బ్యాగ్ ఇచ్చి నీకోసం గిఫ్ఠ్‌గా గోల్డ్ చైన్ తీసుకొచ్చానని చెప్తాడు. ఇక సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం ఇవ్వమని అంటాడు. దాంతో విజయాంబిక ఏమని ఆశీర్వదించాలి అని అంటుంది.
విజయాంబిక: అది కాదు తమ్ముడు ఇలా కాళ్ల మీద పడే వీళ్ల అన్నయ్య మన రూప గొంతు కోశాడు.
గోపీ: మా అన్నయ్యా వదిన గొంతు కోయడం ఏంటి. అసలేమైంది వదిన అన్నయ్య ఇంట్లో లేడా.
దీపక్: ఇంట్లో కాదు అసలు జీవితంలోనే లేడు.
గోపీ: వీళ్లేం మాట్లాడుతున్నారు అసలేమైంది వదినా.
విజయాంబిక: రేయ్ అసలు నువ్వు మా రూపని వదిన వదిన అని పిలవకు. మీ అన్నయ్య రూపని వద్దనుకొని వెళ్లిపోయాడు. రేయ్ ఏం ముఖం పెట్టుకొని వచ్చావ్రా మీ అన్నయ్య చేసిన పాపానికి మా రూప చస్తూ బతుకుతుంది నువ్వు ఇంకా చంపకు.
ముత్యాలు: ఏ తల్లి నిన్ను కాపాడిందో కానీ చల్లగా ఉండాలి. రేయ్ రాజు మన బంటీని కాపాడిని ఆ దేవతని ఇంటికి తీసుకురావాల్సింది.
రాజు: అప్పుడు చంపాలి అనుకున్న అమ్మాయిగారే బంటీని కాపాడారని ఎలా చెప్పనమ్మా. ఇప్పుడు కాపాడినందుకు సంతోషం అప్పుడు చంపాలి అన్నందుకు కోపం ఎలా తీసుకువాలమ్మా.
అప్పలనాయుడు: ఇప్పుడు తీసుకురాకపోతే ఏంటి బంటీ కోలుకున్నాక తీసుకొస్తాడు.
బంటీ: అవును నేను తీసుకొస్తా నానమ్మ.
రోహిణి బంటీని గదిలోకి తీసుకెళ్తుంది. దీపక్ ఇదంతా చేసుంటాడా అని రాజు బావ అంటే రాజు చెల్లి జీవన్ వాళ్లు చేసుకుంటారని అనుకుంటారు. ఇక ఎవరైనా వదలను అని రాజు అంటాడు. సీన్ కట్ చేస్తే గోపీ సూర్యతో సార్ ఇక్కడేం జరిగిందో నాకు తెలీదు కానీ నేను బాగా చదువుకొని సెటిల్ అయితే పెళ్లి చేస్తా అన్నారు అందుకే నేను చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని వచ్చానని అంటాడు. ఎన్ని కలలతో వచ్చానని అంటాడు. విజయాంబిక గోపీతో పింకీని నీకు ఇచ్చి పెళ్లి చేసేదే లేదని అంటాడు. పింకీ వెంటనే రాజుకి కాల్ చేసి రాజు వినేలా ఫోన్ చాటుగా పెడుతుంది. రాజుకి సీన్ అర్థమై బయల్దేరుతాడు. దీపక్ గోపీని ఇంటి నుంచి వెళ్లమంటాడు.
సూర్యప్రతాప్: దీపక్ గోపీకి నేను మాటిచ్చాను.
చంద్ర: పింకీ, గోపీ ప్రేమించుకున్నారు. జీవన్ పింకీని ఎంత ఇబ్బంది పెట్టాడో తెలుసి కూడా ఇంకా పింకీ మీద ప్రేమతో సెటిల్ అయి అన్నయ్య చెప్పిన కండీషన్‌కి ఒకే చెప్పి అన్నయ్య ఇచ్చిన మాట మీద గౌరవంతో ఈ 5 ఏళ్లలో ఒక్క సారి అంటే ఒక్కసారి కూడా పింకీకి కాల్ చేయకుండా మంచి పొజిషన్‌లో కి వెళ్లి ఇప్పుడొచ్చాడంటే ఇంత కంటే మంచి వాడిని పింకీకి తీసుకురాగలమా అక్క ఒక్క సారి ఆలోచించు.
సుమ: అవును వదిన గారు ఈ రోజుల్లో కోటలో యువరాణి అయినా తన భర్త మంచివాడు అయితేనే సంతోషంగా ఉండగలదు. పింకీకి ఇంత కంటే మంచి వాడిని తీసుకురాగలమా.
విజయాంబిక: మనసులో వీళ్లంతా కలిసి పింకీకి వీడినిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు అదే జరిగితే రాజు, రూపలు కలిసిపోతారు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. బాగుంది సుమ చాలా బాగుంది. ఈ ఇంటి యువరాణి రూప బతుకు ఏమైందో అందరూ చూశారు. రూప ఎన్నో ఎదుర్కొని ఆ రాజు వైపు ఉంటే వాడు మాత్రం రూపని వదిలేసి అందరి ముందు రూపని కొట్టి వెళ్లిపోయాడు. అలాంటి కొంపకు ఇప్పుడు మన పింకీని పంపించి తన గొంతు కోద్దామంటే చెప్పుండి మీరు అన్నట్లు చేద్దాం.
గోపీ: ప్లీజ్ సూర్యప్రతాప్ గారు అలా మాట్లాడకండి మా అన్నయ్య చాలా మంచి వాడు వదినకు అన్నయ్య ప్రాణం అన్నయ్యకి వదిన అంటే ప్రాణం.
విజయాంబిక: తమ్ముడు వీడిని మన పింకీని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ బస్తీ వాళ్లు ఏం ఆలోచిస్తారో తెలుసా రూపని వాళ్లతో కలుపుకోవడానికి ఇలా చేశాం అనుకుంటారు
పింకీ: మనసులో అత్తయ్య మొత్తం పెంట పెంట చేసేస్తుంది రాజు వస్తే బాగున్ను.
గోపీ: సార్ నాది ఒక మాట మా అన్నయ్య తప్పు చేశాడు అంటున్నారు కదా మా అన్నయ్య వదిన కలిసే వరకు మా పెళ్లి చేయొద్దు వాళ్లు కలిసిన తర్వాతే మా పెళ్లి చేయండి అంటే కానీ మమల్ని విడదీయొద్దు.
దీపక్: వాళ్లు కలవడం ఏంట్రా మళ్లీ మా రూప రాజుతో కలిసేది లేదు నీకు మా పింకీకి ఇచ్చి పెళ్లి చేసేది లేదు పోరా అని మెడ పట్టుకొని గెంటేస్తాడు.
రాజు: ఇంతలో రాజు వచ్చి గోపీపి పట్టుకుంటాడు. మనది పేద రక్తంరా మనం బస్తీలోనే ఉండాలి మనం ఇలాంటి అద్దాల మేడల వైపు చూడకూడదురా. మనం ఇలాంటి అద్దాల మేడలు తుడవ డానికి పనికొస్తాం. ఇలాంటి వాళ్లతో బతకడానికి పనికిరాం.
రూప ఏం చెప్పాలనుకున్నా రాజు మాట్లాడనివ్వకుండా చేయి అడ్డుపెట్టేస్తాడు. పింకీతో నీకు గోపీకి పెళ్లి చేస్తా అని ఈ పెద్దాయన మాటిచ్చారు ఆయన మాట తప్పురు అని తెలుసు అని అంటాడు. వీళ్ల ప్రేమ నిజం అయితే వీళ్లని ఎవరూ విడదీయలేరు అని రాజు అంటాడు. దానికి దీపక్ వీళ్లని ఎవరూ కలపలేరు అని అంటాడు. పింకీకి నువ్వు మేన బావ అయితే పెళ్లిలో మేన బావ చేయాల్సిన తంతులకు రెడీ గా ఉండు వీళ్లిద్దరినీ నేను ఒకటి చేస్తానని రాజు చెప్తాడు. పెద్దయ్య గారి మాటల్ని నేనే నిజం చేస్తానని ఇప్పుడు కూడా నేనే నిజం చేస్తానని చెప్పి గోపీని తీసుకెళ్తాడు. విజయాంబిక అందరికీ రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుంది. ఇక రాజు ఇంటికి చేరుకుంటాడు. గోపీ కూడా ఇంటికి వస్తాడు. రూప పింకీకి ధైర్యం చెప్తుంది. బాధ పడొద్దని అంటుంది. నా కోసం గోపీ ఇంత చేస్తే ఇంటికి వచ్చిన వాడిని అలా మెడ పట్టుకొని గెంటేయడం ఏంటి అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. బంటీతోనే రాజు, రూపలు.. మందారం, రాఘవని చూసేసిన తల్లీకొడుకులు!