Ammayi garu Serial Today Episode రూప పెళ్లి వాళ్లు తీసుకొచ్చినవి గిల్ట్ నగలు అని చెప్తుంది. విజయాంబికకు నగలు చెక్ చేయమని చెప్తుంది. సూర్యప్రతాప్ రావడంతో విజయాంబిక సూర్యకి విషయం చెప్తుంది. వీళ్ల కోసం ఎంక్వైరీ చేశానని రూప చెప్పగానే ఎందుకు చేశావ్ అని తండ్రి అడగటంతో దీపు కోసం చేశానని చెప్తుంది. 

మౌనిక: దీపుని నా బిడ్డగా స్వీకరించడానికి ఏం చేయమన్నా చేస్తాను. నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోమన్నా చేసుకుంటాను.దీపక్: మామయ్య ఇదంతా పెళ్లిని ఆపడానికి రూప ఆడుతున్న నాటకం అనిపిస్తుంది.రూప: దీపక్ నాటకం ఆడాల్సిన అవసరం నాకేంటి.సూర్యప్రతాప్‌: ఆపు ఇక మాట్లాడక. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకుడిని కాను నేను. సుమ అవి గిల్ట్ నగలో కాదో చెక్ చేయ్. అందరూ చెక్ చేసి ఒరిజినల్ నగలే అంటారు. రూప వాడి గురించి నీ స్థానం పొగొట్టుకోవద్దు. క్షమించండి ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుంది. సుమ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయ్.రూప: నేను విన్నది చూసింది అంతా నిజమే కదా మరి ఎలా మారిపోయింది. గిల్ట్ నగల స్థానంలో ఒరిజినల్ నగలు ఎలా వచ్చాయి.మౌనిక: నీ అనుమానాన్ని నేను క్లియర్ చేయొచ్చా మిసెస్ రూప. నీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసు. రూప: ఏయ్ నాతో నీకు ఏంటి పని వెళ్లు.మౌనిక: వెళ్తా రూప కానీ గిల్ట్ నగలు ప్లేస్లో ఒరిజినల్ ఎలా ఉన్నాయో అని ఆలోచిస్తున్నావా. నవ్వు రావడం మా మాటలు వినడం నేను చూశాను రూప. ఇంత తెలిశాక కూడా నీకు చాన్స్ ఇస్తామని ఎలా అనుకుంటావ్ రూప.రూప: తెలివైన దానివే అయినా ఈ సారికి తప్పించుకున్నావ్ కానీ ఈ పెళ్లి జరగదు.మౌనిక: జరుగుతుంది. రూప: దీపక్ భార్య మందారం బతికే ఉంది.మౌనిక: తెలుసు మందారం వచ్చేలోపు నేను దీపక్ భార్య అయిపోతే. రాజుని అడ్డుకోవడానికి మీ నాన్న ఉన్నారు కదా.రూప: దీపక్ లాంటి బకరా ఇంకా ఎవరైనా ఉంటే వెతుక్కో పెళ్లి కూతురా.

దీపక్ వచ్చి మౌనిక భుజం మీద చేయి వేసి అమ్మా వాళ్లు పిలుస్తున్నారని తీసుకెళ్తాడు. పెళ్లివాళ్లు భోజనాలు చేసి బయల్దేరుతారు. పెళ్లి పనులు ఉన్నాయి బయల్దేరుతామని అంటే మీరు ఏం చేయొద్దు. మేం అన్నీ ఏర్పాటు చేసేశాం.. రేపు గుడిలో పెళ్లి అని సూర్యప్రతాప్‌ చెప్తాడు. గుడా అని దీపక్ అంటాడు. దాంతో విజయాంబిక రాజుని అడ్డుకోవడానికే గుడిలో పెళ్లి అని అర్థమైందని అంటుంది. సూర్యప్రతాప్‌ అందరితో గుడిలోనే పెళ్లి అని ఈ విషయం మనకి తప్ప ఇంకెవరికీ తెలీదని రూపకి కూడా చెప్పొద్దని సూర్యప్రతాప్‌ చెప్తాడు. రూప రాజుకి కాల్ చేసి నగలు గురించి జరిగిన తతంగం చెప్తుంది.  

రాజు పెళ్లి ఆసేస్తాడేమో అని దీపక్ భయపడటంతో విజయాంబిక జీవన్‌కి విషయం చెప్దామని అంటుంది. వెంటనే జీవన్‌కి కాల్ చేసి రేపే దీపక్ పెళ్లి అని రాజు సంగతి చూసుకోమని అంటుంది. జీవన్ సరే అంటాడు. రూప ఫ్యామిలీ మొత్తం గుడికి వెళ్తారు. రూపకి ఏం అర్థం కాదు. రూపకి ఏం తెలీదని దిక్కులు  చూసుకుంటుందని పాపం అని విజయాంబిక అనుకుంటుంది. రూప గుడిలో పెళ్లి అనే విషయం తనకు తెలుసు అని అనుకుంటుంది. సూర్యప్రతాప్‌ రూపకి పెళ్లి గురించి తెలీకూడదని చెప్పడం రూప వినేసి రాజుకి విషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పుష్ప రేంజ్‌లో జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. తల్లి నగలు చెక్ చేసిన జ్యోత్స్న!