Ammayi garu Serial Today Episode మందారం కోలుకోవడానికి సీఎం బామ్మర్ది సన్యాసం పుచ్చుకున్న స్వామీజీ మృత్యుంజయ హోమం ఏర్పాట్లు చేస్తారు. యాగానికి అన్నీ సవ్యంగా జరగాలని పంతులకు ఆయన శిష్యులకు చెప్తారు. ఇంతలో స్వామీజీని కలవడానికి విరూపాక్షి, రాజులు వస్తారు.
స్వామీజీ: విరూపాక్షి ఎలా ఉన్నావ్ అమ్మా. విరూపాక్షి: ఏదో ఉన్నాను అన్నయ్య. మందారం కోసం మీరు మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారని చెప్పారు చాలా సంతోషం అన్నయ్య. స్వామీజీ: ఇది కేవలం మందారం కోసమే కాదమ్మా లోక కల్యాణం కోసం. నువ్వు బావ గారు కలవాలి. రూప, రాజులు కలవాలి. మందారం కోలుకోవాలి విజయాంబిక, దీపక్‌లు మేలుకోవాలి అదే నా కోరిక.విరూపాక్షి: మీరు అనుకున్నవి అన్నీ జరుగుతాయి కానీ నేను సూర్య కలవాలి అన్నది మాత్రం జరగదు.రాజు: అలా ఏం జరగదు అమ్మగారు మందారం కోలుకోగానే రాఘవని నేను తీసుకొచ్చి నిజం చెప్పిస్తా.
సూర్యప్రతాప్ వాళ్లు వస్తారు. మందారం సూర్యప్రతాప్‌తో ఈ హోమం అవసరమా అని అంటుంది. దాంతో స్వామీజీ మహాకుంభమేళ విశిష్టత చెప్పి ఈ టైంలో శివరాత్రి రోజు మహామృత్యుంజయ హోమం చేయడం వల్ల చాలా పుణ్యం కలుగుతుందని మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు. ఇక రూపకి నాట్యం చేసి శివుడిని పులకరింప చేసి నాట్యం ఆపకుండా మహా అఖండ దీపం వెలిగించాలని చెప్తారు. దాంతో సూర్యప్రతాప్ రూప నాట్యం చేస్తుందని అంటాడు. నాట్యం అంటే విరుచుకుపడే సూర్యప్రతాప్ నాట్యానికి అంగీకరించడం ఏంటని విజయాంబిక అనుకుంటుంది. ఇక విరూపాక్షి తన పేరు సూర్యప్రతాప్ పేరు, రూప, రాజుల పేరు మీద అర్చన చేయిస్తుంటే విజయాంబిక ఆపుతుంది. మా తమ్ముడి పేరు మీద మీరు అర్చన చేయించడం ఏంటి? మేం ఎక్కడ ఉంటే అక్కడ ఉండటం ఏంటి అని అడుగుతుంది. వీళ్లు హోమాన్ని అడ్డుకునేలా ఉన్నారు మనమే హోమం ఆపేద్దాం అంటుంది. దాంతో రాజు ఇక్కడ మందారం మంచి కోరే వారు ఎవరు చెడు కోరే వారు ఎవరో తెలుసు అని అంటాడు. ఇక విరూపాక్షి విజయాంబికతో గుడికి ఎవరైనా రావొచ్చు సీఎం రావొచ్చు కామన్ మెన్ రావొచ్చు అని అంటుంది.
విజయాంబిక కొడుకు కోడల్ని తీసుకెళ్లి ప్రదక్షిణలు చేస్తానంటుంది. రూప కూడా మందారానికి తీసుకెళ్లి ప్రదక్షిణలు చేస్తానంటుంది. సూర్యప్రతాప్ వెళ్లమని చెప్తాడు. రూప తల్లి, భర్తని కలుస్తుంది. అత్తయ్య దీపక్‌లు ఏం ప్లాన్ చేస్తారా అని భయంగా ఉందని అంటుంది. విజయాంబిక దీపక్‌తో మందారం లేస్తే మీ మామయ్యతో ప్రమాదం కదా అందుకే మీ మామయ్యని చంపేద్దామని అంటుంది. దీపక్, మౌనికలు షాక్ అయిపోతారు. అందరూ మందారం గురించి అనుకుంటారు కాబట్టి మనం జీవన్‌ని పిలిచి మీ మామయ్యని చంపించేద్దామని అంటుంది. అందుకు జీవన్‌కి కాల్ చేస్తుంది. సూర్యప్రతాప్‌ని చంపేయాలని చెప్తుంది. జీవన్ సరే అంటాడు.
హోమం ప్రారంభిస్తారు. ఓం నమఃశివాయ అంటూ శివనామంతో గుడి మార్మోగుతుంది. అచ్చం పౌర్ణమి సినిమాలో శివయ్య అనుగ్రహం కోసం త్రిష, చార్మి డ్యాన్స్ అదరగొట్టినట్లు రూప అలాగేనే చేస్తుంది. మందారాన్ని పడుకోపెట్టి హోమం మొదలు పెడతారు. రూప నాట్యం చేస్తుంది. జీవన్ అఘోరాలా గెటప్ వేసుకొని తన రౌడీలతో కలిసి రెడీ అవుతాడు. భరత వేదమున అంటూ రూప డ్యాన్స్ చేయడంతో అందరూ పులకరించిపోతారు. సూర్యప్రతాప్ రూపలో విరూపాక్షిని చూసుకుంటాడు. ఇక అఘోరా గెటప్‌లో జీవన్ వాళ్లు అక్కడికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!