Ammayi garu Serial Today Episode: అనాథ ఆశ్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో  కోమలి చనిపోయిందని భావించి వాళ్ల అత్తామామ ఆమెకు పిండప్రధానం చేస్తుంటారు. ఆమె చనిపోయిందని తెలుపుతూ పేపర్‌లో యాడ్‌ కూడా వేయిస్తారు. అదే పేపర్‌ సీఎం సూర్య చదువుతుండగా...కోమలి అక్కడికి వచ్చి చూస్తుంది. పేపర్‌లో తన ఫొటోతో ఉన్న యాడ్‌ చూసి ఉలిక్కిపడుతుంది. ఇది సూర్య చూస్తే...తన పని అయిపోతుందని భయపడుతుంది. ఇంతలో  వేరే పని మీద తమ్ముడు చంద్ర వచ్చి పిలవడంతో సూర్య పేపర్‌ పక్కనపెట్టి ఆ ఫైల్‌ చూస్తుంటాడు. మళ్లీ పేపర్ చదవడం ప్రారంభించగా....ఈసారి  విరూపాక్షి  కాఫీ తీసుకుని అక్కడికి వస్తుంది. దీంతో కోమలి భయం రెట్టింపు అవుతుంది. ఆశ్రమం కాల్చివేసిన వారి వివరాలు ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. లేదు దర్యాప్తు సాగుతోందని చెబుతాడు. ఇంతలోఅక్కడికి వచ్చిన కోమలి...ఆ పేపర్‌ దాచేస్తుంది. ఇంతలో సూర్య, విరూపాక్షి ఇద్దరూ అక్కడి నుంచి  వెళ్లిపోతారు.                     

Continues below advertisement

  కోమలి ఆ పేపర్‌ తీసుకెళ్లి విజయాంబికకు చూపిస్తుంది. తాను చనిపోయాను అనుకుని  మా అత్తమామలు నా పేరిట శ్రద్ధాంజలి ఘటిస్తూ  యాడ్‌ ఇచ్చారని...నాకు దశదిన కర్మకాండాలు కూడా జరిపిస్తున్నారని  చెబుతుంది. ఇప్పుడు నేను వెళ్లి ఆపకుంటే ఆ పని కూడా పూర్తి చేస్తారని కోమలి వారితో అంటుంది. ఈ పేపర్‌ వీళ్ల కంటపడలేదు కాబట్టి బతికిపోయానని...లేకుంటే ఈపాటికి నాకు ఇక్కడే శ్రద్ధాంజలి ఘటించేవారని అంటుంది. మా అత్తయ్య వాళ్లకు నేను బతికే ఉన్నానన్న విషయం తెలియాలని లేకపోతే ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారని ఆమె వారితో చెబుతుంది. అయితే ఫోన్ చేసి వారికి విషయం చెప్పమని దీపక్ అంటాడు. ఫోన్ చేస్తే..ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావని  ఆరాలు తీస్తారని...కాబట్టి నేనే నేరుగా  వెళ్లి వారికి విషయం చెబుతానని కోమలి చెబుతుంది. ఇదంతా చాటుగా  ఉండి రూప, రాజు వింటారు.                         

                             సిటీ చివరలో ఉన్న చెరువు వద్ద పిండప్రధానం  చేస్తున్నారని తెలుసుకుని  కోమలి వాళ్ల మామయ్య వద్దకు వెళ్తుంది. తాను బతికే ఉన్నానని చెప్పి...ఆ కార్యక్రమం ఆపించేస్తుంది. అశోక్‌కు బెయిల్  తీసుకువచ్చేందుకు  నేను బయట ఉన్నప్పుడు  ఆశ్రమంలో అగ్నిప్రమాదం జరిగిందని చెబుతుంది.మరి ఇన్నిరోజులు ఎందుకు మాకు చెప్పలేదని వారు నిలదీస్తారు. అశోక్‌ అరెస్ట్ అయిన బాధలో ఉండి చెప్పలేదని తప్పించుకుంటుంది. వారు ఇంటికి వెళ్దామని పిలిచినా....కొద్దిరోజులు రాలేనని చెబుతుంది.అశోక్‌కు బెయిల్ కోసం ట్రై చేస్తున్నానని చెబుతుంది. తాను సీఎం సూర్య ప్రతాప్‌ కూతురిగా నటిస్తూ  వాళ్ల ఇంట్లోనే ఉంటున్నానని...ఈ విషయం అశోక్ మీకు చెప్పొద్దని చెప్పాడని  వాళ్లతో కోమలి చెబుతుంది. దీంతో మీరు చేస్తున్నది చాలా పెద్దతప్పని కోమలి వాళ్ల అత్త తిడుతుంది. నువ్వు అనాథవైనా  విరూపాక్షి  నీకు ఆశ్రయం కల్పిస్తే...నువ్వు ఆమెను బాధపెట్టడం మంచిది కాదని హితవు పలుకుతుంది. ఇప్పుడే మనం వెళ్లి వాళ్ల కాళ్లమీదపడి క్షమాపణ కోరుకుందామని అంటారు. అలా చేస్తే వాళ్లు ప్రాణాలు తీస్తారని కోమలి భయపడుతుంది. వాళ్లు ఏమైనా చేయని....నువ్వు తప్పు చేయడం మాకు ఇష్టంలేదని అంటారు. నువ్వు తప్పు చేయడం వల్లే అశోక్‌ జైలుపాలయ్యాడని....చావాల్సిన నువ్వు బయటపడ్డావంటే  ఆ నిజం నీతో చెప్పించడానికి దేవుడు బతికించాడని అంటారు. కోమలి ఎంత బ్రతిమాలాడుతున్నా...నేను నిజం చెప్పేస్తానంటూ వాళ్ల మామయ్య బయలుదేరతాడు. ఇంతలో కోమలి వాళ్ల మామయ్యను పట్టుకుని వెనక్కి లాగి కిందపడేయగా...తల రాయికి తగిలి స్పృహతప్పిపోతాడు. ఇది నేను కావాలని చేయలేదని...ఒకవేళ నా పేరు బయటకు చెబితే నిన్ను కూడా చంపేస్తానని కోమలి వాళ్ల అత్తయ్యను బెదిరిస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి  కోమలిని వెతుక్కుంటూ రూప,రాజు వస్తారు.                                      కిందపడిపోయి ఉన్న కోమలి వాళ్ల మామయ్యను పరిశీలించిన రాజు...అతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తామని చెబుతాడు. అతన్ని ఎత్తుకుని రాజు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చూసిన కోమలి మరింత భయపడుతుంది.ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంది. మామయ్య స్పృహలోకి వస్తే...నిజం చెప్పేస్తాడని భావిస్తుంది. పరుగున ఇంటికి వచ్చి  జరిగిన విషయం విజయాంబిక,దీపక్‌కు చెబుతుంది. అక్కడికి రూప,రాజు ఎలా వచ్చారని దీపక్‌ ప్రశ్నిస్తాడు. మీమామయ్య నోరు తెరిచి ఏం చెప్పినా...మనం రిస్క్‌లో పడతామని విజయాంబిక అంటుంది.చెరువుగట్టుకు దగ్గరలో ఉన్న ఆస్పత్రికే తీసుకెళ్లి ఉంటారని...మనం అక్కడికి వెళ్దామని చెప్పి అందరూ బయలుదేరతారు.  అటు ఆస్పత్రిలో కోమలి మామయ్యకు ట్రీట్‌మెంట్ జరుగుతుంటుంది. ఇంతలో అదే ఆస్పత్రికి కోమలి, విజయాంబిక,దీపక్‌ వస్తారు.

Continues below advertisement