Ammayi garu Serial Today Episode హారతిని జీవన్ కంటే ముందే రాజు, రూపలు ఇంటికి తీసుకొస్తారు. హారతి దగ్గరున్న వీడియో సూర్యప్రతాప్ వాళ్లు చూస్తే తన పని అయిపోతుందని జీవన్ టెన్షన్ పడతాడు.  పింకీ మెడలో ఉన్న తాళి జీవన్ కట్టింది కాదని రూప ఇంట్లో వాళ్లకి చెప్తుంది. పింకీతో సహా అందరూ షాక్ అయిపోతారు. ఇక రాజు, రూపలు హారతి తీసిన వీడియోని సూర్యప్రతాప్‌కు చూపిస్తారు. జీవన్ చాలా టెన్షన్ పడతాడు. సూర్యప్రతాప్‌ కోపంగా జీవన్‌ దగ్గరకు వెళ్లి లాగి పెట్టి ఒక్కటిస్తాడు. పింకీని అన్యాయంగా ఇరికిస్తావా అని అరుస్తాడు.


దీపక్ కూడా ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టాలని అంటాడు. దాంతో విజయాంబిక మనం ఎక్కువ అరిస్తే మన బండారం వాడు బయట పెట్టేస్తాడు మనకు అవసరం లేదు అని చెప్తుంది. ఇక సుమ ఆపదలో ఉన్న నా కూతుర్ని కాపాడటానికి తాళి కట్టాను అన్నావు నీలాంటి నీచుడిని ఎలా కన్నదిరా మీ అమ్మ  అని తిడుతుంది. ఆ మాటలకు శ్వేత కూడా తల దించుకుంటుంది. అందరూ జీవన్‌ని తిడతారు. పింకీ కోపంగా తన మెడలో తాళి తీసేసి జీవన్ ముఖం మీద విసిరి కొడుతుంది. నా ఫ్యామిలీని నాశనం చేస్తా అన్నావు చేయ్‌రా అని ముఖం మీద ఉమ్మేస్తుంది. ఇక సూర్యప్రతాప్‌ అందులో ఉన్న పోలీసుల్ని పట్టుకో వాళ్ల పని పట్టాలి అంటాడు. దాంతో హారతి వాళ్లు నిజమైన పోలీసులు కాదని వీడు సెట్ చేసిన రేణుక, గౌతమ్, శ్వేతలే అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇక గోపీ తన బ్యాగ్‌లో డ్రగ్స్ పెట్టింది మీరేనా అని అరుస్తాడు. ఇక రాజు గోపీ, శ్వేతలకు కూడా పెళ్లి జరగలేదని పెళ్లి జరిగినట్లు ప్లాన్ చేశామని శ్వేత మెడలో నేను తాళి కట్టానని రూప చెప్పి వీడియో చూపిస్తుంది.  శ్వేతకి ఆ వీడియో చూపిస్తుంది. మీ అంతు చూస్తానని శ్వేత అంటుంది. మరి నా కూతురి విషయంలో మీరు చేసింది ఏంటి అని వాళ్లని ఊరికే వదలొద్దని సుమ అంటుంది. 


సూర్యప్రతాప్‌ పింకీతో నీ చేతులతోనే వీడిని బయటకు గెంటేయ్ అని చెప్తాడు. దాంతో పింకీ జీవన్ కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్లి బయట తోసేస్తుంది. శ్వేత వెళ్లి అన్నని లేపి వీళ్ల అంతు తేల్చుదామని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తుండగా రూప ఆపుతుంది. పింకీ విసిరేసిన తాళి తీసుకొని జీవన్‌ని ఇచ్చి ఈ తాళి హారతికి కట్టమని చెప్తుంది. జీవన్ వల్ల అన్యాయం అయిన హారతి జీవితాన్ని మనమే న్యాయం చేయాలి అంటుంది. దాంతో జీవన్ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దాన్ని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని పెళ్లికి నో చెప్తాడు. దాంతో సూర్యప్రతాప్‌ డీఎన్‌ఏ రిపోర్ట్స్ ఉన్నాయి వాటిని చూపించి జైలుకి పంపాలా లేక హారతిని పెళ్లి చేసుకుంటావా అని సూర్యప్రతాప్‌ అడుగుతాడు. మధమెక్కిన ఆంబోతువని ఈ తాళితో నీకు సంకెళ్లు వేస్తున్నా కట్టురా తాళి అంటే జీవన్ హారతి మెడలో తాళి కడతాడు. అందరూ క్లాప్స్ కొడతారు.


హారతి ముఖంలో చిరునవ్వు చెరిగితే నీ జీవితం జైలు పాలవుతుందని అంటాడు. హారతి సూర్యప్రతాప్‌ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఏమైనా అయితే నాకు చెప్పు అని అంటాడు. ఇక జీవన్ నాకు ఈ స్థితి తీసుకొచ్చిన ఎవర్నీ వదలను అని రాజు, రూపల్ని అస్సలు వదలను అని అంటాడు. పింకీ అక్క, రాజులకు థ్యాంక్స్ చెప్తుంది. ఇక సూర్యప్రతాప్‌ కూతురు అల్లుడిని మెచ్చుకుంటాడు. ఇక గోపీ, పింకీని పిలిచి మీ నిర్ణయాలు తల్లిదండ్రులకు చెప్పాలి.. మీ భవిష్యత్‌ కోసం వద్దు అన్నా టైం తీసుకుంటామని చెప్తాడు. ఇక మీ ప్రేమకి మేం ఒప్పుకుంటున్నాం అని కానీ ముందు జీవితంలో నిలదొక్కుకోండి తర్వాత పెళ్లి చేస్తామని అంటాడు. ఇక సూర్యప్రతాప్‌ రాజు, రూపల ఫస్ట్‌నైట్‌కి ముహూర్తం ఈ రోజే పెట్టించమని విజయాంబికతో చెప్తుంది. మందారం ముత్యాలు ఇంటికి వెళ్లి మొత్తం చెప్తుంది. ఇక రూప, రాజుల ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారని చెప్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఉండిపోవా నువ్విలా రెండు కళ్లలో ఇలా.. బావతో ఏకాంతంలో జ్యో.. దీప, కార్తీక్‌ల ఫస్ట్‌నైట్!