తెలుగు బుల్లితెర వీక్షకులకు నటుడు అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary)ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'జానకి కలగనలేదు' సీరియల్, తర్వాత రియాలిటీ షోలతో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన వెండితెరపై దృష్టి సారించారు. హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు. అమర్ దీప్ చౌదరి హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే...
అమరావతిలో అమర్ దీప్ కొత్త సినిమాకు క్లాప్! సెన్సేషనల్ గ్లామరస్ లేడీ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన 'మందిర'తో విజయాన్ని అందుకుంది విజన్ మూవీ మేకర్స్. ఇప్పుడు ఆ సంస్థలో అమర్ దీప్ చౌదరి సినిమా చేస్తున్నారు. ఆయన హీరోగా 'సుమతీ శతకం' (Sumathi Shatakam Movie) సినిమా మొదలైంది.
అమర్ దీప్ చౌదరి సరసన సాయిలీ చౌదరి కథానాయికగా నటిస్తున్న 'సుమతీ శతకం' సినిమాను కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎంఎం నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యూత్‌ఫుల్, ఎంగేజింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా అమరావతిలోని వైకుంటపురం విలేజ్ టెంపుల్‌లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ ఇవ్వగా... వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.
Also Read: మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
'సుమతీ శతకం' చిత్రానికి బండారు నాయుడు కథ అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. హాల్ స్వామి ఛాయాగ్రాహకుడిగా, సురేష్ విన్నకోట ఎడిటర్‌గా పని చేస్తున్నారు. 'బిగ్ బాస్' ఫేమ్ టేస్టీ తేజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: రాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి