Meghasandesam Serial Today Episode: భూమి, గగన్‌ కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న న్యూస్‌ అపూర్వ టీవీలో చూసి భూమిని తిడుతుంది. ఇక ఈ ఇంటి ఆడపిల్లకు పెళ్లిల్లు ఎలా అవుతాయని నిలదీస్తుంది. దీంతో కృష్ణ ప్రసాద్‌ వచ్చి అవుతాయి. భూమి, గగన్‌లకు పెళ్లి చేస్తే సరిపోతుంది అని చెప్తాడు. మరోవైపు గగన్‌ వాళ్లు కూడా టీవీలో అదే న్యూస్‌ చూస్తారు. శారద, పూరి షాక్‌ అవుతారు. గగన్‌ కోపంగా లోపలికి వెళ్లిపోతాడు. ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది.

మీరా: ఊరుకోమ్మా భూమి.. ఇందులో నువ్వు చేసిన తప్పేం ఉంది.

భూమి: ఈ వీడియో తప్పొప్పుల గురించి మాట్లాడటం లేదు కదా అత్తయ్యా..? నా క్యారెక్టర్‌ ను చంపేసింది కదా..? ఇక నాకు చావడం తప్పా దారి ఏముంది అత్తయ్యా..?

మీరా: చీచీ అవేం మాటలు భూమి. అయినా నీ క్యారెక్టర్‌ను డిసైడ్‌ చేయడానికి మధ్యలో మీడియా ఎవరమ్మా..? నువ్వేంటో మాకు తెలిస్తే చాలు.

ప్రసాద్‌: అవునమ్మా మీరా కరెక్టుగా చెప్పింది. నువ్వు అనవసరంగా బాధపడకు.

మీరా: అయినా ఈ పాపిస్టి మీడియా రాత్రి నువ్వు కష్టంలో ఉండటాన్ని తెలుసుకోలేకపోయింది. గగన్‌ నిన్ను రక్షించడాన్ని చూడలేకపోయింది. అసలు ఆ మీడియాకు ఏ పాపిస్టోడు ఉప్పు అందించాడో ఏమో..? వాడికి పుట్టగతులు ఉండవు.

ప్రసాద్‌: మీరా ఇప్పుడు వాడిని తిడితే మనం వచ్చేది ఏముంది చెప్పు.

మీరా: అదేంటండి అదేదో మిమ్మల్ని తిట్టినట్టు కంగారు పడతారు.

చెర్రి: పోనీ నాన్నే ఈ పని చేశాడని అనుకుందాం అమ్మా..?

ప్రసాద్‌: చెర్రి ఏం మాట్లాడుతున్నావురా..?

చెర్రి: కాసేపు అనుకో నాన్నా ఎగ్జాంపుల్‌కు చెప్తున్నాను. ఏదో ఒక రకంగా ఇది భూమికే మంచిది.

మీరా: ఓరేయ్‌ నువ్వేం మాట్లాడుతున్నావురా..? భూమి పరువు తీయడం మంచి పనా..?

చెర్రి: అది కాదమ్మా.. భూమి, అన్నయ్య మీదే కదా మీడియా పుకార్లు పుట్టించింది. వీళ్లేం పరాయి వాళ్లు కాదు కదమ్మా..? ప్రేమించుకున్నారు కదా..? రేపు పొద్దున్న మామయ్య మామూలు మనిషి అయితే  ఈ స్థాయిలో భూమి  పరువు పోయిందని తెలిస్తే..  అన్నయ్యకు ఇచ్చే కదా పెళ్లి చేస్తాడు. అది ఒకందుకు మంచిదే కదా..? ఆలోచించండి.

బిందు: భూమి ఒక విధంగా చెర్రి అన్నయ్య చెప్పింది కరెక్టే.. ఇంకా నువ్వు బాధపడుతూ కూర్చోవడం మంచి పద్దతి కాదు.

ఇంతలో శారద, ప్రసాద్‌కు ఫోన్‌ చేస్తుంది.

ప్రసాద్‌: చెప్పు శారద..

శారద: ఈ మీడియా ఐడియా మీదేనా..?

ప్రసాద్‌: అవును శారద నాదే..

శారద: చీ మీకసలు బుద్ది ఉందా..? పిల్లల పరువును రోడ్డు మీదకు ఈడుస్తారా..? రేపు పొద్దున వాళ్లు తల ఎత్తుకుని ఎలా బతుకుతారు.

ప్రసాద్‌: ఒకసారి నేను చెప్పేది వింటావా..?

శారద: చీచీ అసలు మీరు నా కొడుకుకు తండ్రా శత్రువా..?

ప్రసాద్‌: శారద ఒకసారి నేను చెప్పేది విను. అవతల నా కొడుకు, ఇవతల నా మేనకొడలు.

అంటూ ప్రసాద్‌ తన ప్లాన్‌ మొత్తం శారదకు వివరించగానే.. శారద కూల్‌ అవుతుంది.  వాళ్లిద్దరి పెళ్లి చేసేందుకు తాను ఇలా చేశానని చెప్పగానే శారద సారీ చెప్తుంది. ఇంతలో అపూర్వ మళ్లీ వచ్చి భూమిని తిడుతుంది. భూమి అక్కడి నుంచి శరత్‌ చంద్ర దగ్గరకు వెళ్లిపోతుంది. భూమి దగ్గరకు ప్రసాద్‌ వెళ్తాడు.

ప్రసాద్‌: అమ్మా భూమి గగన్‌కు ఫోన్‌ చేశావా.?

భూమి: ప్రేమతో చేసుకునే దాన్ని పెళ్లి అంటారు. కారణాలు చూపించి చేసుకునేది పెళ్లి అవ్వదు. నేను అడగను మామయ్య.

మరోవైపు

గగన్‌: ఏంటమ్మా..? ఏం మాట్లాడుతున్నావు.. ఆ శరత్ చంద్ర ఎవరని మర్చిపోయావా..?

శారద: ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆ శరత్‌ చంద్ర గురించి కాదు. భూమి గురించి ఒక్కసారి నింద పడితే ఆ నింద జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆ నిందను చెరపగలిగేది.. ఆ నిందకు కారణమైన వాడు మాత్రమే.. నువ్వు మాత్రమే.. భూమిని పెళ్లి చేసుకోరా..?

అంటూ శారద ఎమోషనల్‌ అవుతూ గగన్‌ను ఇరకాటంలో పెడుతుంది. మరోవైపు భూమిని కూడా పెళ్లికి ఒప్పించేందుకు ప్రసాద్‌ ట్రై చేస్తుంటాడు. శారద మాటలకు కన్వీన్స్ అయిన గగన్ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!