Aadivaaram with Star Maa Parivaaram: బుల్లితెర షోకి గెస్ట్‌గా హాస్య బ్రహ్మ... రోస్టింగ్ మామూలుగా లేదు... తండ్రిపై గౌతమ్ ఎమోషనల్ కామెంట్స్

Aadivaaram with Star Maa Parivaaram : బుల్లితెర షో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'కి గెస్ట్ గా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వచ్చారు. ఈ షోలో తండ్రిపై గౌతమ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Continues below advertisement

శ్రీముఖి యాంకర్ గా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' అనే బుల్లితెర షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించి ఈ షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా షోలో కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం గెస్ట్ గా పాల్గొన్నట్టు ప్రోమో ద్వారా వెల్లడించారు. 

Continues below advertisement

మధ్యాహ్నం మెగాస్టార్ వర్సెస్ సాయంత్రం సూపర్ స్టార్స్ 
తాజా ఎపిసోడ్ లో 'మధ్యాహ్నం మెగాస్టార్ వర్సెస్ సాయంత్రం సూపర్ స్టార్' అనే పోటీని పెట్టింది శ్రీముఖి. అందులో సాయంత్రం ప్రసారమయ్యే సీరియల్స్ సెలబ్రిటీలు, మధ్యాహ్నం ప్రసారమయ్యే సీరియల్స్ సెలబ్రిటీలు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే డిస్కషన్ వచ్చింది. వీరిద్దరికి పలు పోటీలు పెట్టి, అందులో ఎవరు గెలిస్తే, వారే గొప్ప అనే పరిష్కారాన్ని కనిపెట్టింది. ఆ తర్వాత ఇటు సాయంత్రం, అటు మధ్యాహ్నం సీరియల్స్ సెలబ్రిటీలకు షోలోకి ఆహ్వానం పలికారు. ఎప్పటిలాగే శ్రీముఖి సెటైర్లు, ముక్కు అవినాష్ పంచులు, డాక్టర్ బాబు హడావిడితో షో సందడిగా సాగింది. శ్రీముఖి లవ్ స్టోరీ మరో హైలెట్. 

గెస్ట్ గా బ్రహ్మానందం... 

"నేనెవరో తెలుసా నీకు? నా రికార్డులు ఏంటో తెలుసా నీకు?" అనే డైలాగులతో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లోనే శ్రీముఖి "సార్ నేను ఒక్క విషయం చెప్పాలి" అనగానే... బ్రహ్మానందం "ఇందాకటి నుంచి ఒక్క విషయం ఒక్క విషయం అంటూ 10 చెప్పావు" అంటూ రోస్టింగ్ మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన 'బ్రహ్మా ఆనందం' మూవీ టీం మొత్తం సెట్ లోకి అడుగు పెట్టింది. అలాగే షోలో "నాన్నని తాత చేసేశారేంటండి ?" అని ప్రశ్నించింది శ్రీముఖి. వెంటనే బ్రహ్మానందం అందుకుని "తాతను చేయడానికి మూల కారణం అతను కాదు, ఇతను" అంటూ డైరెక్టర్ వైపు చూపించారు. అలాగే బ్రహ్మానందం తన భార్య 'కార్తీకదీపం' సీరియల్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయాన్ని చెప్తూ, ఫన్నీగా చూపించారు బ్రహ్మానందం. 

గౌతమ్ ఎమోషనల్ కామెంట్స్ 
అలాగే ఆ తర్వాత 'బ్రహ్మా ఆనందం' మూవీలో హీరోగా నటించిన రాజా గౌతమ్, డైరెక్టర్ ఇద్దరితోనూ బ్రహ్మానందం పాపులర్ డైలాగ్ లు చెప్పే గేమ్ ఆడించారు. నిరుపమ్, ముక్కు అవినాష్ ఇద్దరూ బ్రహ్మానందం తిట్లతో ఈ గేమ్ లో హడావిడి చేశారు. చివరగా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' టీం గౌరవపూర్వకంగా బ్రహ్మానందంను శాలువాతో సత్కరించి, సన్మానం చేసింది. "సజీవనదిలా సాగే అందమైన సినిమాలో ప్రయాణించే ప్రతి వాడికి చక్కటి గమ్యం దొరుకుతుంది" అని చెప్పారు బ్రహ్మానందం. ఇక చివరిగా "అమ్మ సైడు నాన్న సైడు నాకు తాత అనేది అసలు తెలియదు, చిన్నప్పుడే చనిపోయారు. ఈ సినిమాతో ఆ లోటు తీరిపోయింది" అంటూ ఎమోషనల్ అయ్యారు గౌతమ్. బ్రహ్మానందం తన కుమారుడిని ఆత్మీయంగా దగ్గర తీసుకోవడంతో ప్రోమో ముగిసింది.

Also Read: త్వరలోనే మోహన్ బాబు బయోపిక్‌ - కచ్చితంగా ఆ హీరోతోనే చేస్తానంటూ మంచు విష్ణు కామెంట్స్

Continues below advertisement