Trivikram Srinivas: గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ జర్నలిస్టుగా మారారు. రమ్యకృష్ణ ముందుకు వచ్చి ఆమెను ఆయనో ప్రశ్న అడిగారు. అందుకు ఆమె జవాబు కూడా ఇవ్వబోయారు. ఇదంతా ప్రమోషనల్ ఇంటర్వ్యూ కోసం కాదు, 'గుంటూరు కారం' సినిమా కోసమే. ట్రైలర్ వరకు అయితే ఆయన జర్నలిస్ట్. మరి, సినిమాలోనూ గురూజీ ఉంటారా? లేరా? అనేది ఇప్పుడు చెప్పలేం. మరో మూడు రోజులు ఆగితే తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...


అది మాటల మాంత్రికుడి గొంతే
'మీరు మీ పెద్దబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు?' - 'గుంటూరు కారం' ట్రైలర్ ప్రారంభంలో వినిపించిన ఈ వాయిస్ ఎవరిదో గుర్తు పట్టారా? అది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గొంతే! ట్రైలర్ వరకు డబ్బింగ్ చెప్పారా? లేదంటే సినిమాలో ఆయన అతిథి పాత్రలో తళుక్కున మెరుస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సాధారణంగా ట్రైలర్ కట్స్ చేసేటప్పుడు ఎవరైనా అందుబాటులో లేకపోతే ఇలా దర్శకులు లేదంటే వేరొకరు డబ్బింగ్ చెబుతుంటారు.


పాటల రచనలోనూ త్రివిక్రమ్ ఉన్నారండోయ్
త్రివిక్రమ్ రచన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆయన డైలాగులకు జనాలు క్లాప్స్ కొడతారు. ఆయనను మాటల మాంత్రికుడు అనేది అందుకే. జస్ట్ డైలాగ్స్ మాత్రమే కాదు... ఆయన లిరిక్స్ కూడా రాస్తారు. కెరీర్ ప్రారంభంలో ఓ సినిమాకు లిరిక్స్ రాశారు త్రివిక్రమ్. మళ్ళీ 'భీమ్లా నాయక్'లో ఓ సాంగ్ రాశారు.


Also Read: శ్రద్ధా శ్రీనాథ్ @ వైఫ్ రోల్స్ - గ్లామర్ రోల్స్ కాదు, సపరేటు రూటులో సైంధవ్ హీరోయిన్



ఇప్పుడు 'గుంటూరు కారం' పాటల్లో కొన్ని కొన్ని లైన్లు త్రివిక్రమ్ రాశారు. గేయ రచయితలకు సాధారణంగా దర్శకులు సలహాలు సూచనలు ఇవ్వడం సహజం. గతంలోనూ త్రివిక్రమ్ ఆ విధంగా చేశారు. అయితే... 'గుంటూరు కారం' సినిమాకు గాను ఆయనకు క్రెడిట్స్ కూడా ఇచ్చారు. స్వీట్ అండ్ స్పైస్ లిరిక్స్ త్రివిక్రమ్ అని పేర్కొన్నారు.


Guntur Kaaram Pre Release Event: గుంటూరులో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో జరగనుంది. అందుకోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షీ చౌదరితో పాటు కీలక నటీనటులు, సాంకేతిక నిపుణులు గుంటూరు చేరుకున్నారని తెలిసింది.


Also Readపెళ్లికి ముందు ప్రెగ్నెంట్... అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?



సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 'గుంటూరు కారం' సినిమా రిలీజ్ అవుతోంది. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ఇది. ఇందులో మహేష్ సరసన యంగ్ హీరోయిన్లు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మలయాళ నటుడు జయరామ్, రావు రమేష్, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్, 'రంగస్థలం' మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ప్రొడ్యూస్ చేశారు.