జాతీయ సినీ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలో టైటిల్ రోల్‌కు గానూ తనకు ఈ అవార్డు దక్కింది. తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.