నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్'. ఇప్పుడు రెండో సీజన్ జరుగుతోంది. ఫస్ట్ సీజన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ, మైటీ భల్లాలదేవ రానా దగ్గుబాటి, దర్శక ధీరుడు రాజమౌళి, అగ్ర దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను వంటి స్టార్లు వచ్చారు. ఆ సీజన్ మహేష్ ఎపిసోడ్‌తో ముగిసింది. మరి, రెండో సీజన్?
పవర్ స్టార్ వస్తారోచ్!
'అన్‌స్టాపబుల్ 2'కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అతిథిగా రానున్నారనేది కొత్త విషయం కాదు. రెండో సీజన్ రెండో ఎపిసోడ్‌లో ఆ విషయం హింట్ ఇచ్చారు. విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ అతిథులుగా వచ్చిన ఆ ఎపిసోడ్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఫోన్ చేయగా... బాలకృష్ణ మాట్లాడారు.
Unstoppable 2 Final Episode : 'అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్?' అని బాలకృష్ణ అడగటం... అందుకు బదులుగా 'మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్' అని త్రివిక్రమ్ బదులు ఇవ్వడం తెలిసిన విషయమే. అప్పుడు బాలకృష్ణ 'ఎవరితో రావాలో తెలుసుగా!?' అని అడగటం వైరల్ అయ్యింది. అప్పుడే పవన్ కళ్యాణ్ వస్తారని అర్థమైంది. ఆ రోజు త్వరలో వస్తుందని సమాచారం.
బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతోన్న 'వీర సింహా రెడ్డి' సాంగ్ షూటింగుకు పవన్ కళ్యాణ్ వచ్చారు. బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ కూడా షూట్ దగ్గర ఉన్నారు. అక్కడ టాక్ షో ప్రస్తావన కూడా వచ్చినట్టు గుసగుస.
సంక్రాంతికి విడుదల కానున్న బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి', సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో సినిమాలే. పవన్ కళ్యాణ్‌తో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి 'అన్‌స్టాపబుల్ 2'లో పాల్గొంటారని సమాచారం. యన్.టి.ఆర్ బయోపిక్‌కు ఆయన దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి కానుకగా పవన్ ఎపిసోడ్!
పవన్ కళ్యాణ్, క్రిష్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలని ఆహా వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో రెండో సీజన్‌కు శుభం కార్డు వేస్తారట. ఫస్ట్ సీజన్‌లో మొత్తం పది ఎపిసోడ్స్ చేశారు. ఇప్పుడు రెండో సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు ఎపిసోడ్స్ వచ్చాయి. ప్రభాస్, గోపీచంద్ సందడి చేసింది ఏడో ఎపిసోడ్. అది న్యూ ఇయర్ కానుకగా విడుదల కానుంది. దానికి, పవన్ ఎపిసోడ్‌కు మధ్య మరో రెండు వస్తాయో? లేదంటే ఒక్కటి వస్తుందో? చూడాలి.
రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్ ప్రోమో!
ఇప్పటి వరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క... ఇప్పుడు వచ్చే గెస్టులు ఓ లెక్క... అనే విధంగా 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) వచ్చారు. వాళ్ళిద్దరితో బాలకృష్ణ చేసిన సందడి ప్రోమోలో ఆడియన్స్ చూశారు. ఇప్పుడు ఆ ప్రోమో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
Also Read : ముఖ్యమంత్రి అభ్యర్థిగా రామ్ చరణ్ - ఆయన రాజకీయ పార్టీ పేరేంటో తెలుసా?
ప్రభాస్, గోపీచంద్ వచ్చిన 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లో రామ్ చరణ్ కూడా సందడి చేయనున్నారు. ఆయనతో ఫోన్ మాట్లాడారు. అప్పుడు ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. గోపీచంద్ కూడా రామ్ చరణ్ రాణి గురించి హింట్ ఇచ్చారా? అన్నట్లు చెప్పారు. దాంతో వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసుకోవాలని ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు.
Also Read : '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన సినిమా ఎలా ఉందంటే?