'హరిహర వీరమల్లు' లేటెస్ట్ అప్డేట్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు ఓ ఫొటోను షేర్ చేశారు దర్శకుడు క్రిష్. ఇందులో పవన్, క్రిష్ లతో పాటు ఏఎం రత్నం, మదన్ కార్కీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'ఎఫ్3' లబ్ డబ్ సాంగ్ ప్రోమో:
వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటిస్తోన్న సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలే ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. వీరితో పాటు కొన్ని పాత్రలను యాడ్ చేస్తున్నారు. అందులో సునీల్, సోనాల్ చౌహన్ లాంటి స్టార్లు ఉన్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నుంచి 'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు' అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.