ఫర్హాన్ రెండో పెళ్లి:
బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. 2016లో తన భార్య అధునా బబానీకి విడాకులు ఇచ్చిన ఫర్హాన్ అప్పటి నుంచి సింగర్ శిబానీ దండేకర్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని ఫర్హాన్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ వెల్లడించారు. ఫిబ్రవరి 21న పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశామని.. కొందరు స్నేహితులు, బంధువుల సమక్షంలో వివాహం జరగనుందని చెప్పారు. శిబానీ చాలా మంది అమ్మాయని.. తన కుటుంబానికి బాగా దగ్గరైంది అన్నారు. ఫర్హాన్ తో ఆమెకి చాలా కాలంగా పరిచయం ఉందని.. వారి రిలేషన్ చాలా బాగుటుందని చెప్పారు.
షారుఖ్ సినిమాలో విక్కీ:
ఇటీవల కత్రినాను వివాహం చేసుకున్న విక్కీ కౌశల్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు మరో సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ ఓ సినిమాను రూపొందించనున్నారు. వేసవిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇందులో ఓ కీలకపాత్ర కోసం విక్కీకౌశల్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో హిరానీ డైరెక్ట్ చేసిన 'సంజు' సినిమా విక్కీ నటించాడు. అతడి రోల్ బాగా హైలైట్ అయింది. ఇప్పుడు మరోసారి హిరానీ సినిమాలో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే.
ఏఎల్ విజయ్ తో జాక్వెలిన్:
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన తదుపరి సినిమా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో చేయనుంది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. కథ ప్రకారం.. సినిమా షూటింగ్ రెండు నెలల పాటు లండన్ లో చేయనున్నారు. ఏఎల్ విజయ్ చివరిగా డైరెక్ట్ చేసిన సినిమా 'తలైవి'. ఇప్పుడు మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమానే చేయబోతున్నారు.