Farhana: వైవిధ్యమై పాత్రలతో ఆకట్టుకునే ఐశ్వర్య రాజేష్ తాజా చిత్రం 'ఫ‌ర్హానా'. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మించిన ఈ చిత్రం మే 12న పలు భాష‌ల్లో రిలీజ్ కానుంది. నెల్స‌న్ వెంక‌టేశ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న ఐశ్వ‌ర్యా రాజేష్.. ఈ సినిమాలో ఆమె ఓ ముస్లిం అమ్మాయిగా క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీరు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ‌గా చేయ‌టానికి కారణమేంటన్న ప్రశ్నకు ఐశ్వర్య సమాధానమిచ్చారు. తెలుగులోనే ప్రసంగించారు.


తాను చెన్నైలోనే పుట్టాను.. అక్కడే పెరిగానని.. తాను చేసిన సినిమాల్లో చాలా వరకు తమిళ సినిమాలేనని ఐశ్వర్య రాజేష్ చెప్పారు. తన తండ్రి తెలుగులో 40 సినిమాలు చేశారని, కానీ నువ్వెందుకు తెలుగులో చేయట్లేదని తన తండ్రి ఎప్పుడూ అడుగుతూ ఉంటుందన్నారు. కానీ తాను మాత్రం తెలుగులో చేస్తే.. మాములుగా చేయకూడదనుకున్నానని వెల్లడించారు. తాను సీనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అని.. కాబట్టి తాను తెలుగులోకి వెళ్తే బ్లాక్ బస్టర్తోనే వెళ్లానని నిశ్చయించుకున్నట్టు ఆమె తెలిపారు. అలా ఎదురుచూస్తుండగానే తనకు 'వరల్డ్ ఫేమస్ లవర్' ద్వారా మంచి అవకాశం వచ్చిందన్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో నటించానని, ఆ తర్వాత 'కౌసల్య క్రిష్ణమూర్తి' రిమేక్ ఇక్కడ చేశామని తెలిపారు.


ఓటీటీలో రిలీజైన 


తెలుగులో నేరుగా 'టక్ జగదీష్', 'రిపబ్లిక్' సినిమాల్లో నటించానని తెలిపారు. అయితే తమిళ సినిమాల్లో తాను దాదాపు సెంట్రిక్ ఫిమేల్ క్యారెక్టర్ లో చేశానని.. దీనిపైనా తన తల్లి ప్రశ్నించేదని.. ఎందుకు తెలుగు సినిమాల్లో సెంట్రిక్  ఫిమేల్ క్యారెక్టర్స్ లో చేయవని అడిగినట్టు ఆమె గుర్తు చేసుకున్నారు.


తాను అప్పుడు కూడా అదే సమాధానమిచ్చానని, తెలుగు సినిమాల్లో ఆ క్యారెక్టర్స్ లో చేయాలంటే స్టార్ పొజిషన్ ఉండాలని చెప్పినట్టు ఐశ్వర్య రాజేష్ అన్నారు. కానీ తెలుగు బిడ్డనైనా.. తనకు పెద్ద క్యారెక్టర్స్, పెద్ద సినిమాల్లో అవకాశం చాలా తక్కువగానే వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎస్ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు తన మీద నమ్మకంతో 'ఫ‌ర్హానా' సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారని చెప్పారు.


ప్రతీ ఆర్టిస్ట్ కీ పైకి వెళ్లడానికి ముఖ్య కారణం.. ప్రొడ్యూసర్, డైరెక్టరేనన్నారు. వాళ్ల వల్లే అంతా జరుగుతుందని చెప్పారు. 'ఫ‌ర్హానా' సినిమాతో ప్రొడ్యూసర్, డైరెక్టర్ తనకు ధైర్యమిచ్చారని ఐశ్వర్య అన్నారు. ఫరానా ఢిపరెంట్ ఫిల్మ్ అని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, వెరీ ఇంటెన్సివ్ గా ఉంటుందని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన పాత్ర బలమైన పాత్ర అని తెలిపారు.


Also Read : విజయ్ దేవరకొండ బర్త్‌డే గిఫ్ట్ - 'ఖుషి'లో తొలి పాట వచ్చేసిందోచ్!


తెలుగు సినిమాల గురించి ప్రస్తావించిన ఐశ్వర్య రాజేష్.. ప్రతి ఒక్కరూ తనను మాటిమాటికీ అడిగే ప్రశ్న.. ఏ సినీ ఇండస్ట్రీ సినిమాను సెలబ్రేట్ చేస్తుంది అని.. ఈ ప్రశ్నకు తాను భయపడకుండా సమాధానం చెప్తానని.. అది తెలుగు ఇండస్ట్రీనేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆడియెన్స్ కూడా చాలా తెలివిగా మారిపోయారని.. రూ.4-500 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. సినిమాలో కంటెంట్ లేకపోతే ఆడట్లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. కానీ అదే కంటెంట్ బాగుంటే.. 'డీజే టిల్లు', 'బలగం' లాంటి చిన్న సినిమాలు బాగా హిట్ అవుతాయన్నారు. తెలుగు ప్రేక్షకులపై తనకు అంత నమ్మకం ఉందని ఐశ్వర్య రాజేష్ చెప్పారు.