ల్లరి నరేష్, విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరో మూవీ తెరకెక్కుతోంది. ఉగ్ర పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఉగ్రం పేరు మాదిరిగానే ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ షాకింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. రక్తంతో నిండిన ఒంటితో దర్శనం ఇస్తున్నాడు. వీపు వెనుక గుచ్చుకున్న కత్తితో  రక్తంతో నిండిన దేహంతో భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈ ఫోస్టర్ చూస్తుంటే సినిమా అంతా రక్తంతో నిండిపోయి ఉంటుందేమోననే అనుమానం కలుగుతుంది. మొత్తంగా ఈ సినిమా వైల్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తున్నది.


ఇప్పటి వరకు అల్లరి నరేష్ కామెడీ సినిమాలే ఎక్కువ చేశాడు. వాటిల్లో ఫ్యాక్షన్ కనిపించినా.. అదీ కమెడీగానే ఉంది. కానీ.. ఈ పోస్టర్ దెబ్బకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. కామెడీ జానర్ల నుంచి బయటకు వచ్చి ఇలాంటి సినిమాలు చేయడం మంచి పరిణామం అంటున్నారు సినీ జనాలు. నరేష్ గతంలో ఇలాంటి కొన్నిసినిమాలను టచ్ చేశాడు. నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, శంభో శివ శంభో, నాంది లాంటి సినిమాలు ఈ కోవలోనవే. ఆ చిత్రాలన్నీ మంచి విజయాన్నే అందుకున్నాయి. తాజాగా మళ్లీ ఉగ్రం పేరుతో వెండితెర మీద ఉగ్రరూపం చూపేందుకు ఈ కామెడీ హీరో రెడీ అవుతున్నాడు. ఈ డిఫరెంట్ మూవీతో అల్లరి నరేష్ హిట్ ట్రాక్ లోకి అడుగు పెడతాడని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమాలో  క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు పలు సామాజిక అంశాలను దర్శకుడు టచ్ చేసినట్లు తెలుస్తోంది.    






అల్లరి నరేష్, విజయ్ కాంబోలో నాంది అనే సినిమా వచ్చింది. నరేష్ నటించిన సీరియస్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. నరేష్ కెరీర్ లో వన్ ఆఫ్ దీ బెస్ట్ మూవీగా నాంది పేరు తెచ్చుకుంది.  విమర్శకుల ప్రశంసలను పొందింది. అటు కమర్షియల్ గానూ మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న నరేష్ ఇప్పుడు మరోసారి అదే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.  ఉగ్రం పేరుతో రెండో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఇంట్రెస్ట్ గా కనిపించింది.  రక్తంతో నిండిన మరకలతో,  సంకెళ్ళు వేసిన చేతులు, ఆ చేతుల నీడ గోడపై స్వేచ్ఛగా ఎగిరే ఒక పక్షిలా కనిపించడం ఆసక్తిని కలిగించింది. సినిమా ప్రకటన రోజే.. ఈ చిత్రం మీద జనాలు ఆసక్తి కనబర్చారు. మొత్తంగా ఈ సినిమా కథను దర్శకుడు విజయం ఇంటరెస్టింగ్ గా రూపొందించినట్లు తెలుస్తోంది.  కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు డిఫరెంట్ సినిమాలను నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలతో పాటు పలు కీలక విషయాలను సినిమా యూనిట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.


Also Read: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్సులు, ఇదిగో ఇలా మార్చేశారు


Also Read: చిరంజీవి బాలీవుడ్ చిత్రాలివే, ఆ సినిమా తర్వాత ఉత్తరాదికి ఎందుకు దూరమయ్యారు?