Dhootha web series director Vikram K Kumar launched Thika Maka Thanda movie trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఖలేజా', కింద నాగార్జున 'రాజన్న', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం', 'లూజర్' వెబ్ సిరీస్... బాలనటిగా మెప్పించిన యానీ (Child Artist Annie) కథానాయికగా పరిచయం అవుతున్న సినిమా 'తికమక తాండ'.  


'తికమక తాండ'లో ట్విన్స్ రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటించారు. ఇందులో రేఖా నిరోషా మరో కథానాయిక. టి.ఎస్‌.ఆర్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై తిరుపతి శ్రీనివాస రావు నిర్మించారు. గౌతమ్‌ వాసుదేవ్ మీనన్‌, చేరన్‌ పాండియన్, విక్రమ్‌ కె. కుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డిసెంబర్ 15న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. విక్రమ్ కె. కుమార్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. 


అమ్మవారి జాడ తెలిసిందా?
Thika Maka Thanda Movie Trailer Review: 'తికమక తాండ' ట్రైలర్ చూస్తే... ఓ పల్లెటూరులో ప్రజలు అందరూ పలకలు, అట్టముక్కల మీద పేర్లు, తాము చేసే పనులు, గుర్తుంచుకోవలసిన విషయాలు రాసి పెట్టుకుంటారు. ఇదేంటి? అని అడిగితే... 'మర్చిపోకుండా' అని ఊరి పెద్ద సమాధానం ఇస్తాడు. ఊరి జనాలు అందరూ గుడిలో పండక్కి సిద్ధం అవ్వగా... అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోతుంది. ఆ విగ్రహం ఏమైంది? హీరోలు ఇద్దరు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Readరేవంత్ రెడ్డికి కంగ్రాట్స్... కేసీఆర్ పార్టీ ఓడిపోగానే ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!  



తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ''నిర్మాతగా నా తొలి చిత్రమిది. కుటుంబంతో చూసేలా మాటల్లో, సన్నివేశాల్లో అసభ్యత లేకుండా తీశాం. సిద్‌ శ్రీరామ్‌ పాడిన 'పుత్తడి బొమ్మ' పాటకు మంచి స్పందన లభించింది. సురేశ్‌ బొబ్బిలి సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ'' అని అన్నారు. దర్శకుడు వెంకట్‌ మాట్లాడుతూ ''మతి మరుపు వల్ల ఓ ఊరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది? దాన్నుంచి చివరకు ఎలా బయట పడింది? అనేది సినిమా కాన్సెప్ట్'' అని చెప్పారు.


Also Read: 'సంతోషం' అవార్డుల్లో కన్నడ స్టార్స్‌కు అవమానం - కొండేటిపై గరం గరం



Thika Maka Thanda movie cast and crew: రామకృష్ణ, హరికృష్ణ కథానాయకులుగా... యానీ, రేఖా నిరోషా కథానాయికలుగా నటించిన 'తికమక తాండ'లో శివన్నారాయణ, 'బుల్లెట్‌' భాస్కర్‌, యాదమ్మ రాజు, 'రాకెట్‌' రాఘవ, 'బలగం' సుజాత, వెంకట్‌, బాబీ బేడీ, రామచంద్ర తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి  కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : హారిక పొట్ట, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బోజడ్ల శ్రీవాస్, లైన్ ప్రొడ్యూసర్: కోట కరుణ కుమార్,  పాటలు : పూర్ణా చారి & లక్ష్మణ్ గంగ, కూర్పు : కుమార్‌ నిర్మల సృజన్‌, కళా దర్శకత్వం : శ్రీనివాస్‌, కథ : బి.ఎన్‌. నిరూప్‌ కుమార్‌, ఛాయాగ్రహణం : హరి కృష్ణన్, సంగీతం : సురేష్‌ బొబ్బిలి, స్కీన్‌ ప్లే : వెంకట్‌ - బి.ఎన్‌. నిరూప్‌ కుమార్‌ - కుమార్‌ నిర్మల సృజన్‌, నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు, మాటలు - దర్శకత్వం : వెంకట్.