దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు పెద్దలు. టాలీవుడ్ బ్యూటీలు కూడా అక్షరాలా ఇదే పాటిస్తున్నారు. సినిమాల ద్వారా ప్రేక్షకులను మదిని దోచుకుంటున్న అందాల తారలు, వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు? వారి సైడ్ బిజినెస్ లు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. కాజల్ అగర్వాల్
2007లో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన కాజల్, కొద్ది కాలంలోనే సత్తా చాటుకుంది. తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించి, అగ్రతారగా ఎదిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ రాణించింది. ఇక తన చెల్లితో కలిసి మర్సాలా అనే ఆభరణాల కంపెనీని స్థాపించింది. ఇటు సినిమాలతో పాటు అటు బిజినెస్ లోనూ రాణిస్తోంది.
2. ప్రణీత సుభాష్
తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో రాణించింది అందాల తార ప్రణీత. మరోవైపు బెంగళూరులో మొదట్లో ఓ రెస్టారెంట్ స్థాపించింది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ లోనూ తన రెస్టారెంట్ బ్రాంచిలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
3. రకుల్ ప్రీత్ సింగ్
తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. తాజాగా ‘ఛత్రివాలీ’తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిట్ నెట్ విషయంలో ముందుండే రకుల్, F45 – ఫిట్నెస్ హెల్త్ హబ్ అనే జిమ్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అన్ని మెట్రో సిటీస్ లో జిమ్ లను ఓపెన్ చేసింది. ఈ జిమ్ లకు పలువురు సెలబ్రిటీలు రావడం విశేషం.
4. తమన్నా భాటియా
‘బాహుబలి’ లాంటి సినిమాల్లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా. ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలో సత్తా చాటుతోంది. 2015లో సొంత ఆభరణాల బ్రాండ్ ను వైట్ & గోల్డ్ పేరుతో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ బిజినెస్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.
5. ఇలియానా
ఇతర హీరోయిన్ల మాదిరిగానే ఇలియానా సైతం సైడ్ బిజినెస్ చేస్తోంది. సినిమాలు పెద్దగా రాకపోవడంతో బిజినెస్ మీదే ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. గోవాలో చైన్ రెస్టారెంట్లు, బేకరీలు రన్ చేస్తోంది.
6. శృతి హాసన్
సినిమా రంగంలో రాణిస్తున్న శృతి హాసన్ బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. ప్రొడక్షన్ హౌస్ షార్ట్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిల్మ్స్, వీడియో రికార్డింగ్ సంస్థను స్థాపించింది.
7. తాప్సీ పన్నూ
చిన్న వయసులోనూ మోడలింగ్ లోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యింది తాప్సీ. ‘ఝుమ్మందినాదం’ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ గా బాగా రాణిస్తూనే బిజినెస్ లోకి అడుగు పెట్టింది. ‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ అనే సంస్థని స్థాపించింది. తన చెల్లి షాగన్, స్నేహితుడు ఫరాహ్హ్ తో కలిసి ఈ సంస్థను మొదలు పెట్టింది. ఈ కంపెనీ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీల పెళ్లి చేశారు.
8. శ్రియా శరణ్
రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న ముద్దుగుమ్మ శ్రియా శరణ్. 2001లో వచ్చిన ‘ఇష్టం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు వ్యాపారాలను మొదలు పెట్టింది. అందులో ప్రధానమైనది ‘శ్రీ స్పందన’ స్పా కంపెనీ. ఇండియాలో ఉన్న ప్రముఖ స్పా కంపెనీల్లో ఇది ఒకటి.
9. కీర్తి సురేష్
‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్. తాజాగా ఈమె కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ‘భూమిత్ర’ పేరుతో తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు కీర్తి వెల్లడించింది.
10. హర్షికా పునాచ
కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో కనిపించి మెప్పించింది హర్షికా పునాచ. ఆ తర్వాత తన బంధువుతో కలిసి ‘గ్లామ్‌గోడ్ ఫ్యాషన్ & ఈవెంట్’ అనే ఫ్యాషన్ సంస్థను ప్రారంభించింది.
Read Also: అప్పట్లో అదోలా చూసేవారు - స్కూల్ డేస్‌ను గుర్తుతెచ్చుకున్న తమన్నా