గత వారం సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’, ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్‌ హీరోగా కతిరేశన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రుద్రుడు’ సినిమాలు విడుదల అయ్యాయి. వీటితో పాటు విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ ‘విడుదలై’ తెలుగులో ‘విడుదల’ పేరుతో రిలీజ్ అయ్యింది. తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తెరకెక్కించారు. వీటిలో ఏ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘శాకుంతలం’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. గతవారం ముచ్చట కాసేపు పక్కన పెడితే ఈ వారం సైతం పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. కొన్ని చిత్రాలు  ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లలో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇటు థియేటర్లు, అటు ఓటీటీల్లో విడుదలకాబోతున్నసినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు


విరూపాక్ష- ఏప్రిల్ 21న విడుదల


సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త మీనన్‌ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ 'విరూపాక్ష'. ఈ సినిమాను  దర్శకుడు కార్తిక్‌ దండు తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. హీరో సాయి ధరమ్ తేజ్  ‘విరూపాక్ష’ సినిమాపై మంచి హోప్స్ తో ఉన్నారు. ఆయన గతంలో నటించిన మూవీలు అంతగా ఆకట్టుకోవపోవడంతో ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. 



హలో మీరా - ఏప్రిల్‌ 21రిలీజ్


గార్గేయి యల్లాప్రగడ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం 'హలో మీరా'.  కాకర్ల శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న శ్రీనివాస్ ఒకే ఒక్క క్యారెక్టర్ తో సినిమాను రూపొందించారు. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మీరా అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా  ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Also Read: ‘విరూపాక్ష’ డైరెక్టర్ ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు: దర్శకుడు సుకుమార్



ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు


నెట్‌ఫ్లిక్స్‌


ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి.


1. హౌ టు గెట్‌ రిచ్‌ (ఇంగ్లీష్‌)  - ఏప్రిల్‌ 18


2. చింప్‌ ఎంపైర్‌ (డాక్యుమెంటరీ) - ఏప్రిల్‌ 19


3. ది మార్క్‌డ్‌ హార్ట్‌ (సీజన్‌ 2)  - ఏప్రిల్ 19


4. చోటా భీమ్‌ (సీజన్‌ - 17)  - ఏప్రిల్‌ 20


5. టూత్‌పరి (హిందీ) - ఏప్రిల్‌ 20


6. డిప్లొమ్యాట్‌ (ఇంగ్లీష్‌)- ఏప్రిల్‌ 20


7. సత్య2 (తెలుగు) - ఏప్రిల్‌ 21


8. రెడీ (తెలుగు)  - ఏప్రిల్‌ 21


9. ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ (వెబ్‌ సిరీస్‌) - ఏప్రిల్‌ 21


10. ఎ టూరిస్ట్స్‌ గైడ్‌ టు లవ్‌(ఇంగ్లీష్‌) - ఏప్రిల్‌ 21


సోనీ లివ్‌


1. గర్మీ (సిరీస్‌) ఏప్రిల్‌ 21


హాట్‌ స్టార్‌


సుగా (డాక్యుమెంటరీ)- ఏప్రిల్‌ 21


Read Also: నమ్మండి, ఇతడు చియాన్ విక్రమ్ - ‘తంగలన్’ మూవీ మేకింగ్ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు