ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు దగ్గరయ్యేకొద్దీ యూనిట్ ప్రమోషన్ల జోరును పెంచుతోంది. ‘The Forces Of RRR - Off the Record Interview’ను చిత్ర బృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఇంటర్వ్యూల గ్యాప్‌లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడుకుంటారో ఫన్నీగా ఇందులో చూపించారు.


ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఏం డ్రెస్ వేసుకోవాలి అనే అంశం మీద కూడా ఫన్నీ డిస్కషన్ నడిచింది. మిలటరీ అవుట్‌ఫిట్‌లో వస్తానని చరణ్ చెప్పగా... దానికి కూడా రీషూట్ చేస్తారా అని తారక్ కామెడీగా అన్నాడు. కాఫీ తాగుతారా, పెట్టి తీసుకురానా అని చరణ్ అడిగినప్పుడు ‘నీ చేత్తో విషం ఇచ్చినా తీసుకుంటా’ అని టిపికల్ డైలాగ్ డెలివరీతో తారక్ చెప్పడం బాగా హైలెట్ అవుతోంది. ఇలాంటి అంశాలు ఇందులో చాలా ఉన్నాయి.


మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. 24వ తేదీ సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్లు పడనున్నాయని తెలుస్తోంది. మార్చి 18వ తేదీన దుబాయ్‌లో, 19వ తేదీన కర్ణాటకలో ప్రీ-రిలీజ్ ఈవెంట్లు కూడా నిర్వహించనున్నారు. దీంతోపాటు దేశంలోని వేర్వేరు వివిధ నగరాల్లో కూడా దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.