ఆయనో ఐపీఎస్ ఆఫీసర్. పేరు అరుణ్ బోత్రా. జైపూర్ ఎయిర్‌పోర్టులో దిగారు. బరువుగా ఉన్న తన బ్యాగును అతి కష్టం మీద ట్రాలీలో పెట్టుకుని నెట్టుకుటూ వెళ్తున్నారు. కొంచెం దూరం నుంచిఎయిర్‌పోర్టు అధికారి ఆగండి అని అరిచాడు. అంతే.. అరుణ్ బోత్రా ఆగిపోయారు. ఆయన దగ్గరకు వచ్చిన ఎయిర్‌పోర్టు అధికారి బ్యాగ్ తెరవమని ఆదేశించారు. కానీ అరుణ్ బోత్రా సందేహించారు. కానీ ఎయిర్ పోర్టు అధికారి మాత్రం తెరవాలని పట్టుబట్టారు. చివరికి తప్పనిసరిగా తెరిచారు. అందులో ఉన్నవి చూసి ఎయిర్‌పోర్టు అధికారికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమీ చేయలేక వెళ్లిపొమ్మన్నాడు. ఇంతకూ ఆ బ్యాగులో ఏమున్నాయ్?. గ్రీన్ పీస్ అంటే..పచ్చి బఠానీ కాయలు ఉన్నాయి. 


 






మంచి క్వాలిటీ బ్యాగ్.. ఎవరైనా అందులో  అంతకు మించి ఖరీదైన బట్టలు పెట్టుకుని వెళ్తారు. లేదా.. విలువైన వస్తువులు పెట్టుకుంటారు. కానీ అరుణ్ బోత్రా మాత్రం గ్రీన్ పీస్ పెట్టుకుని వచ్చారు. ఎయిర్‌పోర్టుకు వస్తూంటే కేజీ రూ. నలభై రూపాయలకే అమ్ముతుంటే తెచ్చుకున్నానని ఆయన చెబుతున్నారు. తన బ్యాగులో గ్రీన్ సీస్‌ని ఎయిర్‌పోర్ట్ సిబ్బందిచెక్ చేసిన విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతే క్షణాల్లో ఆ ఫోటోలతో సహా ట్వీట్ వైరల్ అయిపోయింది. 


 






అరుణ్ బోత్రా ట్వీట్‌కు వందల మంది ఫన్నీ రిప్లయ్‌లు ఇస్తున్నారు. ఒకరైతే తాము బ్యాగులో మామిడి పండ్లు తెచ్చామని ఇలాగే చెక్ చేశారని ఫోటోలు పెట్టారు. 


 



అరుణ్ బోత్రా పెట్టిన ట్వీట్ నిజమో కాదో స్పష్టత లేదు..కానీ ఆయనకు ఫాలోయర్లు ఇస్తున్న రెస్పాన్స్ మాత్రం సూపర్ కామెడీగా ఉన్నాయి.