The Expendables 4 Trailer: ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ నుంచి వచ్చే కొన్ని మూవీ సిరీస్ లు ఎంత గానో ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో ‘ది ఎక్స్పెండబుల్’ సిరీస్ కూడా ఒకటి. 2010 లో వచ్చిన ‘ది ఎక్స్పెండబుల్’ నుంచి ఈ సిరీస్ ప్రారంభం అయింది. త్వరలోనే ‘ది ఎక్స్పెండబుల్ 4’ మూవీ రాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు హాలీవుడ్ మూవీ లవర్స్. తాజాగా ఈ మూవీకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ‘ఎక్స్పెండబుల్ 4’ మూవీకు స్కాట్ వా దర్శకత్వం వహించాడు. ‘ది ఎక్స్పెండబుల్ 3’ తర్వాత ఈ సిరీస్ భవిష్యత్ గందరగోళంగా మారింది. తరవాత సిరీస్ ఉంటుందా లేదా అనే ప్రశ్రార్థకంగా మారింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 


కొత్త మార్పులతో తిరిగి వస్తోన్న ఎక్స్పెండబుల్ టీమ్..


‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ విషయానికొస్తే.. మిషన్ గన్స్, కత్తి పోరాటాలు, సముద్రం మధ్యలో విమాన విన్యాసాలు ఇలా భారీ యాక్షన్ సీక్వెన్స్ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సిల్వెస్టర్ స్టాలోన్ ఎక్స్పెండబుల్ కు నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అలాగే మూవీలో పాత నటులతో పాటు కొత్త పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. జాసన్ స్టాథమ్, డాల్ఫ్ లండ్‌గ్రెన్, రాండీ కోచర్ అందరూ మూవీలో స్టాలోన్‌ తో కలిసి మిషన్ లో భాగం కానున్నారు. వీరితో పాటు కర్టిస్ “50 సెంట్” జాక్సన్, మేగాన్ ఫాక్స్, టోనీ జా, జాకబ్ స్కిపియో, లెవీ ట్రాన్, ఎడ్డీ హాల్, ఐకో ఉవైస్, ఆండీ గార్సియా వంటి కొత్త తారాగణం కూడా మూవీలో కనిపిస్తోంది. ట్రైలర్ లో ఫాక్స్ స్టాథమ్ పాత్ర లీ క్రిస్మస్‌తో కలుస్తాడు అప్పటి నుంచి మూవీలో మిషన్ స్టార్ట్ అవుతుంది. 


దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత..


‘ది ఎక్స్పెండబుల్ 3’ మూవీ 2014 లో వచ్చింది. అయితే ఈ మూవీ గత సిరీస్ లతో పోలీస్తే అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దీని తర్వాత సిరీస్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. దానికి తోడు కొన్ని అనుకోని కారణాల వలన స్టాలోన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తాత్కాలికంగా తప్పుకోవడంతో తదుపరి పార్ట్ కు చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు తాను తిరిగి ప్రాంచైజీ లో చేరుతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ ప్రాజెక్ట మళ్లీ పట్టాలెక్కింది. స్టాలోన్ ఫ్రాంచైజీ యొక్క తొలి చిత్రానికి దర్శకత్వం వహించాడు మరియు మొదటి మూడు "ఎక్స్‌పెండబుల్స్" చిత్రాలకు రచయితగా పనిచేశాడు, అతను నాల్గవ విడతలో నటనపై మాత్రమే దృష్టి సారించాడు. స్కాట్ వా ‘ది ఎక్స్‌పెండబుల్స్ 4’ కి దర్శకత్వం వహించగా, మాక్స్ ఆడమ్స్ మరియు స్పెన్సర్ కోవెన్ దాని స్క్రిప్ట్‌ను రాశారు. ఇలా అనేక మార్పులు చేర్పులు తర్వాత మళ్లీ ‘ది ఎక్స్పెండబుల్ 4’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 22, 2023 న విడుదల కానుంది. ఈ సినిమాను మిలీనియం మీడియా, క్యాంప్‌బెల్ గ్రోబ్‌మాన్ ఫిల్మ్స్ నిర్మించారు, లయన్స్‌గేట్ విడుదల కానుంది.