టాలీవుడ్​ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్​ తమన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్లాక్ బాస్టర్​ హిట్ పాటలతో దుమ్మురేపడమే కాకుండా, కాపీ క్యాట్ అంటూ ట్రోలింగ్ కు గురవుతుంటారు. తమన కొత్త పాట రిలీజ్ అయితే చాలు, పాట బాగుందా? బాగాలేదా? అనేది పక్కన పెట్టి.. ఈ పాట ట్యూన్స్ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడు అని ఆరా తీస్తుంటారు. ఒకవేళ ఒరిజినల్ సాంగ్ చేసినా కూడా ఏదో ఒకరకంగా ఆయనను టార్గెట్ చేసి ఆనందపడుతుంటారు. కొంతకాలం పాటు ఇబ్బంది పడిన తమన్ ఆ తర్వాత లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. తనపై వచ్చే ట్రోల్స్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నట్లు పలు మార్లు ఆయనే చెప్పుకొచ్చారు.  


నెటిజన్లపై నోరు పారేసుకున్న తమన్


ఇక తమన్ సంగీతమే కాదు, ఒక్కోసారి ఆయన మాట్లాడే మాటలు కూడా తీవ్ర విమర్శలపాలైన సందర్భాలున్నాయి. తాజాగా బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా సక్సెస్ మీట్ లో ఆయన నోరు జారారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే? ఒక సినిమా కోసం తాము ఎంతో కష్టపడి పని చేస్తామని చెప్పారు.  ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా సినిమాపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. అందుకే, చిన్నచిన్న విషయాల పట్ల కూడా చాలా కేర్ తీసుకుంటామన్నారు. అయితే, నెటిజన్లు ప్రతి విషయాన్ని ట్రోల్ చేయడంపై తీవ్రంగా స్పందించారు. "ట్విట్టర్, ఫేస్ బుక్  తెరిస్తే నా కొడుకులు ఏదేదో వాగుతున్నారు. మా కష్టం వాళ్లకేం తెలుసు?" అంటూ స్టేజ్ మీదనే సీరియస్ కామెంట్స్ చేశారు.  


తమన్ పై నెటిజన్ల ఆగ్రహం


ప్రస్తుతం తమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక సంగీత దర్శకుడు ఓ పెద్ద ఈవెంట్ లో ఇలా మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో కీలక స్థానంలో ఉన్నవాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేదని ఇలా నోరు పారేసుకుంటే, ఎంతో కాలంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు గంగలో కలవడం ఖాయం అంటున్నారు. తమ మాటలేకాదు, చేష్టలు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కాపీ ట్యూన్స్ మానేసి, కొత్తగా ట్యూన్స్ కొడితే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు. నెటిజన్లను తిట్టడం మీద పెట్టే శ్రద్ధ సొంత ట్యూన్ల మీద పెడితే బాగుంటుందంటున్నారు.  


అటు ‘భగవంత్ కేసరి’ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్​ ప్లస్​గా నిలిచింది. బ్యాక్​ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అనే టాక్ వచ్చింది. బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది.  శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించింది. అర్జున్ రాంపాల్ విలన్‌‌ పాత్రలో కనిపించారు.  షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.


Read Also: మావారి కంటే ఆయనే బెస్ట్, దీపికా కామెంట్స్‌కు రణవీర్ షాక్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial