2022లో కొన్ని తెలుగు సినిమాలు నెగటివ్ రివ్యూలు పొందినా, ఆ తర్వాత కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ‘ధమాకా’ సినిమాపైనా విడుదలైన రోజున నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ, ఆ తర్వాత కలెక్షన్ల సునామీ సృష్టించింది. రూ.100 కోట్ల గ్రాస్ తో రవితేజ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. ‘ధమాకా’ మాదిరిగానే 2022లో నెగెటివ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..  


1. బంగార్రాజు – గ్రాస్ కలెక్షన్స్ రూ.110-120 కోట్లు


‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ‘బంగార్రాజు’. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఓ రేంజిలో హైప్ పొందింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా నెగెటివ్ తో పాటు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. కానీ, చివరకు ఈ సినిమా రూ. 118+ కోట్ల గ్రాస్ తో సంక్రాంతి హిట్ గా నిలిచింది.


2. సర్కారు వారి పాట – గ్రాస్ కలెక్షన్స్ రూ.160+ కోట్లు


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. విడుదలైన తొలి రోజు ఈ చిత్రం  మిక్స్డ్ టాక్ తో పాటు నెగెటివ్ రివ్యూలను పొందింది. కానీ SVP సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ తో లాంగ్ రన్ లో 160+ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.


3. F3 – గ్రాస్ కలెక్షన్స్ రూ.120+ కోట్లు


వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కలిసి నటించిన సినిమా ‘ఎఫ్3’. తొలుత ఈ సినిమాకు ఫుల్ నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చాయి. లాంగ్ రన్ లో రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


4. గాలోడు – గ్రాస్ కలెక్షన్స్ రూ.5 కోట్లు


సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సినిమా ‘గాలోడు’. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి పూర్తి నెగటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ, రూ.2.5 కోట్లు బ్రేక్‌ ఈవెన్‌ గా ఉండడంతో ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ని క్రాస్ చేసి రూ.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.


5. ధమాకా- గ్రాస్ కలెక్షన్స్ రూ.100 కోట్లు


2022 ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అయినా మాస్ మహారాజా రవితేజ సినిమా ‘ధమాకా’. ఈ మూవీకి తొలి షో నుంచే  నెగిటివ్ రివ్యూలు, మిక్స్‌డ్ టాక్ వచ్చేసింది. కానీ, ఆ తర్వాత వీకెండ్ వరకు మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మొత్తంగా ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ తో  రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.






Read Also:  ‘పఠాన్’కు పాట్లు - బాయ్‌కాట్‌పై బాలీవుడ్ కలవరం, కేంద్రాన్ని ఆశ్రయించిన సినీ పెద్దలు