Gurthunda Seethakaalam: 'గుర్తుందా శీతాకాలం' టైటిల్ ట్రాక్ విన్నారా?

సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Continues below advertisement

తనదైన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్‌టైల్' సినిమాకి ఇది రీమేక్. తొలిసారి సత్యదేవ్, తమన్నా కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో మంచి బజ్ ఏర్పడింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ఆలస్యమైంది. ఇప్పుడు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. వాలెంటైన్స్ వీక్ లో సినిమా వస్తుందని అంటున్నారు. 

Continues below advertisement

దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. తాజాగా సినిమా టైటిల్ ట్రాక్ ను విడుదల చేశారు. 'గుర్తుందా శీతాకాలం' అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటను సంజిత్ హెగ్డే పాడారు. ఆయన వాయిస్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మంచి మెలోడియస్ అండ్ రొమాంటిక్ గా సాగిపోయింది ఈ పాట. 

''ప్రతి ఒక్కరు త‌మ జీవితంలో కొన్ని విష‌యాల్ని ఎప్పటికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి సంఘ‌ట‌నలను ప్రేక్షకుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని'' గతంలో దర్శకుడు వెల్లడించాడు. 

ఈ సినిమాను నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.

Continues below advertisement
Sponsored Links by Taboola