Ooru Peru Bhairavakona: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, స్పెషల్ మేకింగ్ వీడియోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా.. వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. సస్పెన్స్ అండ్ ఉత్కంఠను రేకెత్తించే ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన 'ఊరు పేరు భైరవకోన'లో హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన మూవీ టీజర్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ టీజర్ లో శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణానికి, ఇప్పటి గరుడపురాణంకు నాలుగు పేజీలు తగ్గాయనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చారు. ఆ నాలుగు పేజీలే భైరవ కోన అంటూ టీజర్‌తోనే సినిమా స్టోరీని చెప్పేశారు. అయితే ఆ మాయమైన పేజీల్లో ఏమున్నాయి. అసలు భైరవకొనలో ఏం జరుగుతుంది అనే అంశాలతో సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. టీజర్‌లో ఈ ఊరిలోకి రావడమే కానీ, బయటకు పోవడం ఉండదంటూ వచ్చిన డైలాగ్‌ విపరీతమైన క్యూరియాసిటీ పెంచుతోంది. దర్శకుడు విఐ ఆనంద్‌ చాలా కాలం తర్వాత తనకు ఎంతో ఇష్టమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్‌లో సినిమా చేస్తుండటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది.


ఈ టీజర్ గురించి చెప్పాలంటే.. మూవీకి శేఖర్‌ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టేదిలా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకు స్పెషల్ హైలెట్ గా నిలుస్తోంది. అద్భుతంగా తీసిన నైట్ షాట్స్.. మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. 2022 మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మేకర్స్.. సినిమాలోని ‘నిజమేనే చెబుతున్నా’ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను 2023 మార్చి 31న విడుదల చేశారు. ఈ సాంగ్ కు కూడా ప్రేక్షకులు నుంచి మంచి ఆదరణే లభించింది. ఇదిలా ఉండలా.. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఊరు పేరు భైరవకోనలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైనమెంట్స్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


ఇక హీరో సందీప్ కిషన్ గురించి చెప్పాలంటే.. కొంత కాలంగా హిట్లకు దూరమై విజయం వైపుకు అడుగులు వేస్తున్నారు. ఎన్ని సినిమాలు చేసినా.. బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తుండడం మరో చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. ఇటీవల ఆయన చేసిన 'మైఖేల్' సైతం తొలిరోజే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుని బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు చేయబోయే 'ఊరు పేరు భైరవకోన'పైనే ఆశలు పెట్టుకున్నారు సందీప్ కిషన్. ఇప్పటివరకైతే ఈ సినిమా మీ మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను భైరవకోన అందుకుంటుందా.. లేదా ఇదీ ఫ్లాప్ ల జాబితాలో పడిపోతుందా అన్నది వేచిచూడాల్సిందే.