క్కినేని అఖిల్‌కు ఇప్పటికీ సరైన హిట్ పడట్లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు దశాబ్దం కావొస్తున్నా.. ఒక్కటంటే ఒక్క గట్టి హిట్ కూడా అందుకోలేకపోయాడు. చివరిగా అఖిల్ 2021లో పూజా హెగ్డేతో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఫర్వాలేదు అనే టాక్ సంపాదించుకున్నా, అఖిల్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కెరీర్ లో గుర్తుంచుకునే హిట్ ఏమీ దక్కించుకోలేదు. ఎలాగైనా తన తర్వాతి సినిమాతో సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే అఖిల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.


‘ఏజెంట్’పై అఖిల్ ఆశలు


ఈ నేపథ్యంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తిరుగులేని హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం కీలక అప్ డేట్ ఇచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేసింది.  






సరికొత్త లుక్ లో అఖిల్


ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే, ఓ రేంజిలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయనిపిస్తోంది. అదిరిపోయే యాక్షన్ సీన్ల కోసం ఎంతలా కష్టపడ్డారో కనిపిస్తోంది. అఖిల్ చేసే స్టంట్లు సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈ సీన్లలలో అఖిల్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండేది. కానీ, షూటింగ్ లో జరిగిన జాప్యం కారణంగా విడుదల ఆలస్యం అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను సమ్మర్ కు వాయిదా వేశారు.


‘ఏజెంట్’కు భారీ రెస్పాన్స్


అటు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ సినీ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. అఖిల్ యాక్షన్ సీన్లు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆయన స్టైల్ యూత్ ను ఆకట్టుకుంటోంది. అఖిల్ స్టైల్ పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు హాలీవుడ్ సీన్లను తలపిస్తున్నాయి. ఈ సినిమాలో అఖిల్ స్పైగా నటిస్తున్నాడు.






ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సైరా’ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఏజెంట్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేసవిలో ఈ సినిమా విడుదలకానుంది.


Read Also: ఆ సినిమాలకు పోటీగా ‘శాకుంతలం’ - రిలీజ్ డేట్ వచ్చేసింది