దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. మెగా నందమూరి అభిమానులు థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. అభిమానులతో పాటు సినిమాను చూడడానికి సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, సుకుమార్ ఇలా ఇండస్ట్రీకి చెందిన పలువురు 'ఆర్ఆర్ఆర్' సినిమాకి రివ్యూ ఇచ్చారు. అయితే చాలా మంది మహేష్ బాబు రివ్యూ కోసం చూశారు. ఎందుకంటే మహేష్ నెక్స్ట్ సినిమా రాజమౌళితో చేయనున్నారు. కాబట్టి కచ్చితంగా మహేష్ 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం మాట్లాడతారని అభిమానులు భావించారు. దానికి తగ్గట్లే ఈరోజు మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా సినిమాను తెగ పొగిడేశారు.
'ఆర్ఆర్ఆర్' సినిమా ఒక ఎపిక్ అని.. సినిమా స్కేల్, గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్కటీ ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్, చరణ్ తమ స్టార్ డమ్ కి మించి వరల్డ్ క్లాస్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని పొగిడేశారు. 'నాటు నాటు' సాంగ్ లో లా ఆఫ్ గ్రావిటీ అసలు కనిపించలేదని.. వారు ఎగురుతూ డాన్స్ చేశారని పేర్కొన్నారు. ఇలాంటి సినిమాను రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' టీమ్ కి హ్యాట్సాఫ్ చెబుతూ.. ఎంతో గర్వంగా ఉందంటూ రాసుకొచ్చారు.
Also Read: రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ
Also Read: విదేశాల్లో 'ఆర్ఆర్ఆర్' వసూళ్ళ దండయాత్ర! ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?