Rajni Kanth Health Live: రజినీ ఆరోగ్యంపై ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల.. ఆయనకు సమస్య ఏంటంటే..
అగ్ర నటులు రజినీ కాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆయన భార్య స్పందించారు. లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
Background
గురువారం (అక్టోబరు 29) సాయంత్రం ఉన్నట్టుండి అనారోగ్యం కారణంగా రజినీ కాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. విషయం బయటకు రావడంతో రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు. ‘‘రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ...More
రజినీ కాంత్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్‌ను కావేరీ ఆస్పత్రి విడుదల చేసింది. 28వ తేదీన ఆయనకు అస్వస్థత వచ్చిందని పేర్కొంది. తమ ఆస్పత్రిలోని నిపుణుల టీమ్ ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అనే మెడికల్ ప్రొసీజర్ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ మేరకు దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని కావేరీ ఆస్పత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది.
కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అంటే..
మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే రక్త నాళాల్లో ప్లాక్స్ ఏర్పడడం వల్ల రక్త సరఫరాకు అడ్డంకి ఏర్పడుతుంది. ఫలితంగా మెదడుకు ఆక్సీజన్ కూడా సరిపడా అందదు. కాబట్టి కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అనే మెడికల్ ప్రొసీజర్ ద్వారా రక్త నాళాల్లో ప్లాక్స్‌ను తొలగిస్తారు.