బుల్లితెరని ఆరేళ్ళ పాటు నిర్విరామంగా ఏలింది కార్తీకదీపం సీరియల్. ఈ వారంతో సీరియల్ కి ఎండ్ కార్డ్ పడబోతుంది. అందరికీ నచ్చే క్లైమాక్స్ తో ముగింపు పలకబోతున్నట్టు సీరియల్ బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ‘స్టార్ మా’లో ప్రసారమయ్యే ఆదివారం స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్ లో ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పరిటాల నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, పిల్లలు శౌర్య, హిమ కూడా పాల్గొన్నారు. డాక్టర్ బాబు, దీప కలిసి స్క్రీన్ మీద కనపడితే ఆ సీన్ చూసేందుకు సూపర్ గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.


డాక్టర్ బాబు, దీప కలిసి డాన్స్ చేసి అలరించారు. “ఇప్పుడే కుట్టింది చీమ.. డాక్టర్ బాబు అంటే నాకు ప్రేమ” అని కవిత చెప్పేసి వావ్ అనిపించింది వంటలక్క. ఈ సీరియల్ ముగిసిపోతుంది అంటే కాస్త బాధగా ఉందని నిరుపమ్ బాధపడ్డాడు. తర్వాత ప్రేక్షకులు అందరూ కలిసి డాక్టర్ బాబు రీల్ ఫ్యామిలీకి గజమాల వేసి సత్కరించారు. చివరగా వంటలక్క డాక్టర్ బాబుకి ప్రేమగా ముద్దు పెట్టి ఏడ్చేసింది. ప్రోమోలో చూపించిన సీన్ గతంలో వచ్చిన సీరియల్ ఎపిసోడ్ లో చూపించారు. అదే మళ్ళీ సీన్ స్టేజ్ మీద నటించినట్టుగా అనిపిస్తుంది.






Also Read: సౌందర్యకి నిజం చెప్పిన మోనిత- కార్తీక్ కి రెండో పెళ్లి చేస్తానన్న దీప


సీరియల్ చివరిదకి రావడంతో ఒక్కొక్కటిగా చిక్కుముడులు వీడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న కథ ప్రకారం దీప, కార్తీక్ పిల్లలు, సౌందర్య దగ్గరకి వస్తారు. దీప తను ఎక్కువ కాలం బతకదు అనే విషయం ఎలాగైనా సౌందర్యకి చెప్పి కార్తీక్ ఎలాగైనా రెండో పెళ్లి చెయ్యాలని చూస్తుంది. మరోవైపు అందాల విలన్ మోనిత మాత్రం డాక్టర్ బాబు ప్రేమని దక్కించుకోవడం కోసం తన గుండె దీపకి పెట్టి బతికించుకోమని ఆఫర్ ఇస్తుంది. మళ్ళీ ఇటు వైపు మోనిత దీప పరిస్థితి గురించి సౌందర్యకి చెప్పేస్తుంది. 


దీప అనారోగ్యం గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేక..దీపను ఎలా బతికించుకోవాలో తెలియక బాధపడుతున్న కార్తీక్ కి అద్భుతమైన ఆఫర్ ఇస్తుంది మోనిత. నీకోసం కొట్టుకుంటున్న ఈ గుండె..నీ ప్రేమను అందుకుంటున్న దీపకు ఇచ్చేస్తాను.. అందుకు ప్రతిఫలంగా నా మెడలో తాళికట్టు..నీ భార్యగా ఒక్కరోజైనా బతికి చచ్చిపోతాను అని అడుగుతుంది మోనిత. మరోవైపు దీప...నాకు నిండునూరేళ్లు మీతో బతకాలని ఉంది ఏదైనా అవకాశం ఉందా అంటుంది. ఇద్దరి మాటలు విని కార్తీక్ ఆలోచనలో పడతాడు...


ఇదే క్లైమాక్స్


మోనిత పీడ వదిలించుకోవాలన్నా ...దీపను బతికించుకోవాలన్నా కార్తీక్ ఉన్న ఒకే ఒక మార్గం మోనిత ప్రపొజల్ కి ఎస్ చెప్పడం.మోనిత మెడలో తాళికడితే..ఆమె పైశాచిక ప్రేమ నెగ్గిందన్న ఆనందంలో ఉంటుంది. మరోవైపు ఎప్పటికీ దక్కని కార్తీక్ కోసం తాపత్రయ పడేకన్నా..కార్తీక్ గుండెల్లో ఉన్న దీపకు గుండె దానం చేయడం వల్ల ఆ విధంగా కార్తీక్ ప్రేమను పొందొచ్చు అనేదే మోనిత ప్లాన్ అని తెలుస్తోంది.