హీరోలు, దర్శకులు, నిర్మాతల పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అనేది సాధారణ విషయం. ఎన్టీఆర్, ఏఎన్నార్ రోజుల నుండి ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారంతా కూడా తండ్రి వారసత్వాన్ని, లెగసీను కంటిన్యూ చేస్తున్నవారే. ఇండస్ట్రీ కుటుంబాల నుండి అబ్బాయిలు మాత్రమే కాకుండా అమ్మయిలు కూడా యాక్టింగ్ కెరీర్ లో రాణించిన వారు ఉన్నారు. గతంలో సుప్రియ, రీసెంట్ గా నీహారిక కొణిదెల వంటి తారలు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 




అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటిగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న 'శాకుంతలం' సినిమాలో అల్లు అర్హ లిటిల్ ప్రిన్సెస్ గా కనిపించనుంది. ఈ చిన్నారిలానే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కిడ్స్ ను వెండితెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 



సితార ఘట్టమనేని :



మహేష్ బాబు గారాల పట్టి సితారకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఈ వయసులోనే సంపాదించేస్తుంది. ఎప్పటికప్పుడు సితారకు సంబంధించిన వీడియోలను నమ్రత షేర్ చేస్తుంటుంది. ఇప్పటికే సితారను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తామని చాలా మంది అడిగారట. కానీ ప్రస్తుతానికి మాత్రం మహేష్-నమ్రతలకు అలాంటి ఆలోచన లేదు. కానీ ఫ్యూచర్ లో సితార నటిగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. 


అభయ్ రామ్, భార్గవ రామ్ :




ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్ చూడడానికి అచ్చం తన తండ్రిలానే ఉంటారు. వీళ్లను చూసుకుంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోలు బయటకు వచ్చాయంటే చాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంటాయి. అభయ్, భార్గవ్ లను వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. కానీ ఎన్టీఆర్ కి ఇప్పట్లో వారిని లాంచ్ చేసే ఆలోచన లేదని సమాచారం. 



అల్లు అయాన్ :




అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన 'డీజే' సినిమా ఈవెంట్ లో హీరో రేంజ్ లో స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు ఈ బుడతడు. అయాన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తన చెల్లెలి మాదిరి అయాన్ కూడా త్వరలోనే వెండితెరపై కనిపించే ఛాన్స్ ఉంది. 



అకీరా నందన్ :




పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరడుగుల అకీరా ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వాటిల్లో నిజం లేదని రేణుదేశాయ్ చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. అకీరా వ్యవహారం చూస్తుంటే ఇప్పట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చేలా లేడనిపిస్తుంది. మరి ఇంకెప్పటికీ రెడీ అవుతాడో చూడాలి!



అర్జున్ :




నేచురల్ స్టార్ నాని ఎప్పటికప్పుడు తన కొడుకు అర్జున్ తో తీసుకున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. చాలా మంది అభిమానులు అర్జున్ ను స్క్రీన్ పై ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటూ నానిని అడుగుతుంటారు. 



అర్జున్ దగ్గుబాటి :




సీనియర్ హీరో వెంకటేష్ ఫ్యామిలీ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది. వెంకీ కొడుకు అర్జున్ కి సంబంధించిన ఫోటోలు కూడా పెద్దగా దొరకవు. కొడుకు విషయంలో వెంకీ ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ అర్జున్ ఎంట్రీ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు.