Mathu Vadalara 2 OTT Partner Fix: 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహా కోడూరి. అప్పట్లో ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. వసూళ్ల పరంగానూ ఫర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత శ్రీసింహా పలు సినిమాల్లో నటించినా సాలిడ్ హిట్ పడలేదు. ఈ నేపథ్యంలోనే మాంచి హిట్ కొట్టాలనే లక్ష్యంతో 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్ గా  'మత్తు వదలరా 2' అనే సినిమాను చేశాడు. ఈ మూవీ ఇవాళ(సెప్టెంబర్ 13న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందంటున్నారు.


ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీసింహా, సత్య


‘మత్తు వదలరా 2‘ చిత్రంలో శ్రీసింహా, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపించారు. వీరిద్దరి కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినట్లు తెలుస్తోంది. సినిమాను వీరిద్దరు తమ భుజాల మీద వేసుకుని ముందకు నడిపించారంటున్నారు ఆడియెన్స్. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫరియా అబ్బుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో స్పెషల్ ఏజెంట్ గా నటించిన ఫరియా, శ్రీసింహ, సత్యతో కలిసి ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూ ఇవ్వండతో మంచి హిట్ కొట్టబోతున్నట్లు అర్థం అవుతోంది.


‘మత్తువదలరా 2‘ ఓటీటీ పార్ట్ నర్ లాక్


తాజాగా మత్తువదలరా 2‘  సినిమాకు సంబంధించి ఓటీటీ పార్ట్ నర్ లాక్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్‌ ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది. ఈ మూవీ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడినప్పటికీ, నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ అమౌంట్ ను చెల్లించి రైట్స్ దక్కించుకుంది. అయితే, ఈ మూవీ కోసం ఎంత డబ్బు ఖర్చు చేసింది? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు, ఈ సినిమా ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయం గురించి క్లారిటీ రాలేదు. అయితే, ఈ చిత్రం థియేటర్లలో విడులైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకోచ్చేలా నిర్మాతలతో డీల్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంటే.. సెప్టెంబర్ 13న ఈ సినిమా థియేటర్లలోకి రాగా,  అక్టోబర్ మూడో వారంలో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే  నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన 'మత్తు వదలరా 2'  సినిమాను క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు నిర్మించారు. వెన్నెల కిశోర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ అందించాడు.  



Read Also: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ