మిళ హీరో శివ కార్తికేయన్ నటించిన తాజాగా సినిమా ‘ప్రిన్స్’. ‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్‌ కె.వి. దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉక్రెయిన్ బ్యూటీ మరియా హీరోయిన్ గా నటించింది.

  ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ప్రిన్స్’ హీరో శివ కార్తికేయన్ విజయ్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు. సినిమా పరిశ్రమలో తమ జర్నీ రైలు ప్రయాణంలా నెమ్మదిగా మొదలై వేగం పుంజుకుంటే, విజయ్ దేవరకొండ కెరీర్ రాకెట్ లా దూసుకెళ్లిందని చెప్పాడు.


విజయ్ దేవరకొండపై శివ ప్రశంసలు


“ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోల్లో స్మార్టెస్ట్ హీరో విజయ్ దేవరకొండ. ఆయన నటించిన ‘గీత గోవిందం’ సినిమా నాకు ఎంతో ఇష్టం. నటుడిగా సినిమా పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకున్నాను. నా సినీ ప్రయాణం రైలు మాదిరిగా నెమ్మదిగామొదలై, అక్కడక్కడ ఆగుతూ మళ్లీ స్పీడందుకుంది.  కానీ, విజయం ప్రయాణం రాకెట్ లా దూసుకెళ్లింది. తక్కువ సమయంలోనే పాన్‌ ఇండియా స్టార్‌ గా ఎదిగాడు. అతడి సినీ ప్రయాణం ఎంతో స్పూర్తి కలిగిస్తుంది. విజయ్ తో కలిసి నటించాలని ఉంది. ఆ కల త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నాను” అని  శివ కార్తికేయన్‌ వెల్లడించాడు.   


శివ కార్తికేయన్ ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం


శివ కార్తికేయన్ సినిమా ‘ప్రిన్స్’లో భాగస్వాయ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు విజయ్ దేవరకొండ. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఏషియన్‌ సినిమాస్‌ సంస్థలు తన కెరీర్ ను పూర్తిగా మార్చాయని వెల్లడించాడు. అలాంటి సంస్థలు కలిసి నిర్మించిన ‘ప్రిన్స్’ సినిమా ప్రమోషన్ లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.  ఈ సినిమా ట్రైలర్ తనకు ఎంతో బాగా నచ్చిందన్నాడు. ఎప్పుడైనా బోర్ కొడితే అనుదీప్ తెరకెక్కించిన వీడియోలు చూస్తుంటానని చెప్పాడు. శివ కార్తికేయన్ ను కలవడం ఇదే తొలిసారి అని చెప్పిన విజయ్.. ఆయన స్టార్ గా ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం అన్నాడు. శివ కార్తికేయన్ పై నాకు బ్రదర్ ఫీలింగ్ ఉంది. మరియాను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించాడు.   


యుద్ధంలోనూ నవ్వులు పూయిస్తాడు


దర్శకుడు అనుదీప్ పై మరో దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసలు కురిపించారు. మధ్యతరగతి జీవితాలను దగ్గరుండి చదివాడని చెప్పారు. ప్రపంచం కరోనాతో యుద్ధం చేస్తున్న సమయంలో ఆయన  ‘జాతి రత్నాలు’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడని తెలిపారు. యుద్ధం జరుగుతున్న  ఉక్రెయిన్‌ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్‌ చేశారని ప్రశంసించారు. యుద్ధంలో కూడా నవ్వులు పూయించడం సినిమాకే సాధ్యమని, ఆ కాన్సెప్ట్ తోనే ఈ సినిమాను అనుదీప్ తీసినట్లు తెలుస్తుందని చెప్పారు.


మరోవైపు ఈ ప్రిన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయినందుక రానా సినిమా యూనిట్ కు క్షమాపణలు చెప్పాడు. వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ఆయన విమానం ఆలస్యం కారణంగా ఈ వేడుకకు రాలేక పోయానని తెలిపాడు. శివ కార్తికేయన్ తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని రానా ఆకాంక్షించాడు.


Read Also: ‘బాహుబలి-2’లోని ఆ సీన్‌ను దించేసిన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్’ వెబ్ సీరిస్, ఇండియన్ డైరెక్టర్ పనే!