షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి నటించిన వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. నకిలీ నోట్లను ముద్రించే వ్యక్తిగా షాహిద్ కపూర్ కనిపిస్తుండగా, తనను పట్టుకునే రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతిని చూడవచ్చు. ట్రైలర్‌ను బాగా ఆసక్తికరంగా కట్ చేశారు.


షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిలతో పాటు రాశి ఖన్నా, రెజీనా కసాండ్రా, కేకే మీనన్‌లను కూడా ఈ వెబ్ సిరీస్ చూడవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. చూస్తుంటే అమెజాన్ ప్రైమ్ రూపొందించిన అత్యంత ఖరీదైన ఇండియన్ వెబ్ సిరీస్‌గా ఇది కనిపిస్తుంది.


ట్రైలర్‌లో రాశి ఖన్నాను కూడా పోలీస్ ఆఫీసర్‌గా చూపించారు. అయితే ఏ హీరోకి ఎవరు జోడి అనేది క్లియర్‌గా తెలియలేదు. షాహిద్ కపూర్ ఒక ముద్దు సన్నివేశంలో నటించాడు. కానీ అందులో నటించిన నటి ఎవరో క్లారిటీగా చూపించలేదు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దీన్ని స్ట్రీమ్ చేయనున్నారు.


బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కు మంచి క్రేజ్ ఉంది. అలాగే సౌత్ ఇండియన్ సినిమాల్లో విజయ్ సేతుపతికు మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ వెబ్ సిరీస్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి మార్కెట్ బాగా పెరిగింది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన విజయ్ సేతుపతి తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


కేవలం హీరో దగ్గరే ఆగిపోకుండా నటనకు ప్రాధాన్యతనిచ్చి ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే విలన్ పాత్రల్లోనూ అదరగొడుతున్నాడు. దీంతో విజయ్ సేతుపతి అన్ని భాషల్లోనూ అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఇద్దరు పెద్ద హీరోలు కలసి నటిస్తోన్న వెబ్ సిరీస్ కావడంతో దీనిపై మరింత ఉత్కంఠ నెలకొంది.


ఇక ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ ను యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ లో షాహిద్ కపూర్ గుబురు గడ్డంతో క్యాజువల్ డ్రెస్ లో కనిపిస్తుండగా విజయ్ సేతుపతి స్టైలిష్‌గా కనిపిస్తున్నాాడు. క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోందని సమాచారం. దీని బట్టి చూస్తే షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి పూర్తి వ్యతిరేకత ఉన్న క్యారెక్టర్లుగా అనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు గా ఈ విడుదల కానుంది. ఈ సిరీస్ ను డి2ఆర్ ఫిల్మ్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.