కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన తాజా సినిమా ‘పఠాన్’. ఈ చిత్రానికి 'వార్' లాంటి సూపర్ డూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్, స్పై ఫిల్మ్ గా ఈ సినిమా రూపొందింది. ఇందులో షారుఖ్ ఖాన్ గూఢచారిగా కనిపించనున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


నెటిజన్లతో షారుఖ్ ఇంటరాక్షన్


ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో ‘Ask SRK’ (ఆస్క్ షారుఖ్) పేరుతో నెటిజన్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కొందరు ఆయన సినిమాలు, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగారు. మరికొంత మంది ఆయనపై ట్రోలింగ్ కు కూడా దిగారు.   


నెటిజన్ ఘాటు కామెంట్, షారుఖ్ కూల్ రిప్లై


ఇంటరాక్షన్ లో భాగంగా ఓ నెటిజన్ "పఠాన్ డిజాస్టర్ ఆల్రెడీ, రిటైర్మెంట్ తీస్కో" అని ట్వీట్ చేశాడు. దీనికి షారుఖ్ ఖాన్ చాలా సంయమనంతో సమాధానం చెప్పారు. "బేటా బడోన్ సే ఐసే బాత్ నహీ కర్తే!!" (బిడ్డా, పెద్దవాళ్లతో ఇలా మాట్లాడకూడదు) అంటూ రిప్లై ఇచ్చారు. ఆయన రిప్లై పట్ల నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎదుటి వారు రెచ్చగొట్టేలా, కించపరిచేలా మాట్లాడినా షారుఖ్ మాత్రం చక్కగా సమాధానం చెప్పారంటూ కామెంట్స్ పెట్టారు.   






3 నిమిషాల నిడివితో ‘పఠాన్’ ట్రైలర్


జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్‌ పోషిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా, జాన్ అబ్రహం కీలక పాత్రలో కనిపించనున్నారు.  గత సంవత్సరం SRK పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల అయ్యింది. ఈ జనవరి 10న మళ్లీ తన బర్త్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ దాదాపు మూడు నిమిషాల నిడివితో ఉంటుందని పింక్‌ విల్లా వెల్లడించింది. ఈ ట్రైలర్ యాక్షన్ సీక్వెన్సులు, మ్యూజిక్, హీరోయిజంతో కలిపి ఉంటుందని తెలిపింది.    


‘పఠాన్’పై తీవ్ర విమర్శలు


మూడేళ్ల తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ తెరపై కనిపించనున్నారు. 2018 వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. అయితే ‘పఠాన్’ సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుంచి సినిమాపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలైయ్యాయి. సోషల్ మీడియాలో కూడా మూవీను బహిష్కరించాలని కామెంట్లు చేశారు కొంతమంది నెటిజన్స్. ఈ సినిమా హాలీవుడ్ వార్ అండ్ మార్వెల్స్ కు కాపీ లా ఉందనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ సినిమాలో ‘బేషరమ్ రంగ్’ అనే పాటపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఈ పాట ఉందని ఆందోళనలు జరిగాయి. కాగా ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  


Read Also: సమ్మర్‌లో శర్వానంద్ షాదీ! వధువు ఎవరో తెలుసా?