Aamir Khan: షారుక్ ఒత్తిడితో ల్యాప్ టాప్ కొన్న అమీర్ ఖాన్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఒత్తిడితో అమీర్ ఖాన్ ల్యాప్ టాప్ కొన్నారు. అయితే, ఎలా ఉపయోగించాలో తెలియక 5 ఏండ్ల పాటు ఓపెన్ చేయలేదు. చివరకు ఓపెన్ చేసి షాక్ అయినట్లు వెల్లడించారు అమీర్ ఖాన్.

Continues below advertisement

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ చెప్పడంతో  అమీర్ ఖాన్  ఓ ల్యాప్‌టాప్ కొన్నారు. కానీ, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అమీర్ కాస్త వెనుకబడి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు అప్పటి వరకు ల్యాప్ టాప్ ఎలా ఉపయోగించాలో తెలియదు. ఈ కారణంగా ఆయన ఆ ల్యాప్ టాప్ ను 5 ఏండ్ల పాటు ఓపెన్ చేయలేదు. చివరకు  దాన్ని ఓపెన్ చేయడంతో అది పని చేయలేదని తెలిపారు. తాజాగా జరిగిన NASSCOM ఆన్యువల్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ సమ్మిట్ లో అమీర్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Continues below advertisement

టెక్నాలజీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా!

నాస్కామ్ సమ్మిట్ లో గెస్టుగా పాల్గొన్న అమీర్ ఖాన్, షారుఖ్ కొనిచ్చిన ల్యాప్ టాప్ గురించి వివరించారు. “1996లో ఓ లేటెస్ట్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని షారుఖ్ చెప్పారు. దాని అవసరం తనకు లేదని భావించినా, షారుఖ్ చెప్పాడని కొనుగోలు చేశాను. కానీ, దానిని ఎలా ఉపయోగించాలో తెలియక సుమారు 5 ఏండ్ల పాటు దాన్ని ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత ఓ రోజు దాన్ని ఓపెన్ చేశాను. కానీ, చాలా కాలం ఉపయోగించకపోవడంతో ఆ ల్యాప్ టాప్ ఓపెన్ కాలేదు” అని చెప్పారు. ఇదే కార్యక్రమంలో టెక్నాలజీకి తాను చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని అమీర్ ఖాన్ వెల్లడించారు. “టెక్నాలజీకి నేను ఇప్పటి వరకు చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. షారుఖ్ ఖాన్ తో పోల్చితే నేను టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాను” అని చెప్పారు.  

ఇప్పటి వరకు కలిసి నటించిన షారుఖ్, అమీర్

బాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌  ఇంత వరకూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ‘పెహ్లా నాషా’లో మాత్రమే అతిధి పాత్రలో కనిపించారు. 1993లో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌ లో దీపక్ తిజోరి, పూజా భట్, రవీనా టాండన్, పరేష్ రావల్ నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో చివరిగా కనిపించిన అమీర్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.  బాయ్ కాట్ బాలీవుడ్ క్యాంపెయిన్ తో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఘోర పరాభవం కారణంగా అమీర్ ఖాన్ కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ‘పఠాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు షారుఖ్ ఖాన్. ఆయన కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఆయన ‘జవాన్’ సినిమాలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Read Also: ‘సలార్’ లీక్ - ఆసక్తికర విషయాన్ని చెప్పిన జగపతిబాబు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement