టాలీవుడ్ లో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా కేవలం తన టాలెంట్ ను నమ్ముకుని వచ్చిన నటుడు సత్యదేవ్. కాస్త ఆలస్యమైనా మంచి గుర్తింపే సాధించాడు. చిన్న హీరోల్లో బిజీగా ఉండే హీరో సత్యదేవ్. సైలెంట్ గా వరుసపెట్టి సినిమాలు చేసుకెళ్లిపోతున్నాడు. అతడు నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్సే’. ఆ సినిమాలో అతని లుక్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో దెబ్బతిన్న పులిలా కనిపిస్తున్నాడు హీరో. ముఖంపై దెబ్బలతో, దీర్ఘాలోచనలో ఉన్నలుక్ తో విడుదలైన పోస్టర్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఒక్కొక్క సినిమాతో తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న సత్యదేవ్ కు గాడ్సే వల్ల ఎంత పేరు వస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తుండడం విశేషం. ఐశ్వర్య లక్ష్మీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. 


సత్యదేవ్ నిజజీవితంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మంచి ఉద్యోగాన్ని వదిలి మరీ ఇండస్ట్రీకి వచ్చాడు. తొలిసార 2011లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాలో చిన్నపాత్రలో కనిపించాడు. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించాడు. వాటితో తగిన గుర్తింపు రాలేదు. ఆ తరువాత వచ్చిన జ్యోతి లక్ష్మి సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమాకు మంచి పేరు వచ్చినా, సత్యదేవ్ కు మాత్రం అవకాశాలు తెచ్చి పెట్టలేదు. క్షణం, మన ఊరి రామాయణం, ఘాజీ ఇలా కొన్ని సినిమాలలో నటించాడు. చివరికి బ్లఫ్ మాస్టర్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2020లో విడుదలైన తిమ్మరుసు హీరోగా అతడిని నిలబెట్టిన సినిమా. ప్రస్తుతం స్కైలాబ్, గాడ్సే సినిమాలలో నటిస్తున్నాడు. 


[insta]






Also read: బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన పద్దతులు చెబుతున్న ఆయుర్వేదం


Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!


Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి