Mrs World 2022 Sargam Koushal:


లవ్‌యూ ఇండియా: సర్గమ్ కౌశల్ 


21 ఏళ్ల తరవాత భారతీయ మహిళకు మిసెస్ వరల్డ్ (Mrs World 2022) అవార్డు వరిచింది. జమ్ముకశ్మీర్‌కు చెందిన సర్గమ్ కౌశల్ (Sargam Koushal) ఈ అవార్డు అందుకున్నారు. 63 దేశాల నుంచి మహిళలు పోటీ పడగా...వారందరినీ వెనక్కి నెట్టి ఈ కిరీటం అందుకున్నారు సర్గమ్. ఇన్‌స్టా గ్రామ్‌లో The Mrs India pageant అధికారికంగా ఈ విషయం వెల్లడించింది. సర్గమ్ కౌశల్‌ ఫోటోను షేర్ చేసింది. "ఎప్పుడెప్పుడా అన్న ఉత్కంఠకు తెర పడింది. 21 ఏళ్ల తరవాత మళ్లీ ఇండియాకు ఈ అవార్డు దక్కింది" అని ప్రకటించింది. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ఈ  పోటీలు జరిగాయి. 2021లో మిసెస్ వరల్డ్‌గా అవార్డు అందుకున్న షాయలిన్‌ ఫోర్డ్‌ చేతుల మీదుగా ఈ సారి కిరీటం అందుకున్నారు సర్గమ్ కౌశల్. కౌశల్..మిసెస్‌ పాలినేషియా  తొలి రన్నరప్‌గా.. మిసెస్‌ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు. సర్గమ్ కూడా  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "21 ఏళ్ల తరవాత మనకు ఈ అవార్డు దక్కింది. చాలా సంతోషంగా ఉంది. లవ్‌యూ ఇండియా" అని పోస్ట్ చేశారు. గ్రాండ్ ఫినాలే కోసం కౌశల్ ధరించిన డ్రెస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. స్లీవ్‌లెస్ పింక్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయారు. చివరి సారి 2001లో భారతీయ మహిళ డాక్టర్ అదితి గోవిత్రికర్‌కు మిసెస్ వరల్డ్‌ కిరీటం దక్కింది. ఆమె ఈ సారి పోటీలకు జడ్జ్‌గా వ్యవహరించారు. ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీజీ చేసిన విశాఖపట్నంలో కొంత కాలం పాటు టీచర్‌గా పని చేశారు. క్యాన్సర్ బారిన పడిన చిన్నారుల బాగోగులు చూసుకునే స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ఆమె భర్త ఆది కౌశల్..ఇండియన్ నేవిలో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ముంబయిలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో Mrs India World కిరీటాన్నీ దక్కించుకున్నారు సర్గమ్ కౌశల్. 


 










Also Read: Parliament Winter Session: చైనాపై చర్చకు సభాపతి నో- రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్!