స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తన కేరీర్ తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా తన బర్త్ డే వేడుకలకు సంబంధించి ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.    


సమంత బర్త్ డే నిర్వహించిన ‘సిటాడెల్‘ టీమ్


గత నెల 28న సమంతా బర్త్ డే. 35 ఏండ్లు పూర్తి చేసుకుని 36వ వసంతంలోకి అడుగు పెట్టింది. పలువురు సినీ అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినీ స్టార్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘సిటాడెల్’ టీమ్ తో పాటు తన స్నేహితులు బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వెల్లడించింది. తను అనుకున్నట్లుగా పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరిగినట్లు వివరించింది. “బర్త్ డే రోజు సింపుల్ రూల్స్ పెట్టుకున్న. సర్ ప్రైజ్ లు, కేకులు, బెలూన్ లు ముఖ్యం కాదు. నేను అనుకున్నది, నేను కోరుకున్నది లభించింది” అని రాసుకొచ్చింది. సమంత షేర్ చేసిన బర్త్ డే ఫోటోల్లో తన స్నేహితులతో పాటు ‘సిటాడెల్’ యూనిట్ కనిపించింది. అందరూ కలిసి ఆమె బర్త్ డే నిర్వహించారు. దర్శకుడు రాజ్, డీకే, వరుణ్ ధావన్ ఆమెకు కేక్ తినిపించారు. బర్త్ డే రోజున సమంత మినీ డ్రెస్ లో సూపర్ డూపర్ లుక్ లో కనిపించింది.   






సిటాడెల్’ షూటింగ్ సమంత బిజీ బిజీ


ప్రస్తుతం సమంత ‘సిటాడెల్’ ఇండియా వెర్షన్ లో నటిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజ్ & డీకే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు లండన్ లోనూ ఈ సిరీస్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది. సమంత ఇటీవల లండన్‌లో జరిగిన ‘సిటాడెల్’ గ్లోబల్ ప్రీమియర్‌కు హాజరయ్యింది. ప్రియాంక చోప్రాతో కలిసి సమంతా ఈ షో తిలకించింది. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి ‘కుషి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఆమె నటించిన ‘శాకుంతలం’ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లను సాధించలేకపోయింది.


వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు


సమంత గత రెండేళ్లుగా వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటుంది. నాగ చైతన్యతో విడాకులు అయ్యాయి.  మానసిక ఒత్తిడికి గురయ్యింది. ఆ వేదన నుండి కోలుకున్న వెంటనే మయోసైటిస్ రూపంలో మరో సమస్య ఆమెను చుట్టుముట్టింది. ప్రస్తుతం అన్ని సమస్యల నుంచి బయటపడి సినిమాలతో బిజీగా గడుపుతోంది.   


Read Also: ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 35 కోట్లు ఖర్చు - సల్మాన్, షారుఖ్ కాంబో అంటే ఆ మాత్రం ఉండదా మరి!