సరోగసీ... సరోగసీ... సరోగసీ... ఇప్పుడు ఎక్కువగా వినబడుతోన్న మాట! నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన తర్వాత సరోగసీ చట్టాల గురించి చర్చ కూడా మొదలైంది. నయనతార కంటే ముందు శిల్పా శెట్టి, శిల్పా శెట్టి, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, లక్ష్మీ మంచు వంటి సెలబ్రిటీలు సరోగసీ ద్వారా సంతానం పొందారు.


ఇప్పుడు సమంత (Samantha) కూడా సరోగసీని ఎంపిక చేసుకున్నారు. అయితే... రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో! అసలు వివరాల్లోకి వెళితే...


సరోగసీ నేపథ్యంలో 'యశోద'
Yashoda Movie Based On Surrogacy Concept : సమంత టైటిల్ రోల్‌లో నటించిన సినిమా 'యశోద' (Yashoda Movie). ఈ రోజు ట్రైలర్ (Yashoda Trailer) విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సరోగసీ కాన్సెప్ట్‌తో రూపొందింది. ఆ విషయాన్ని ట్రైలర్‌లో రివీల్ చేస్తున్నారని తెలిసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి మెయిన్ ట్విస్టులు (Yashoda Movie Main Twist) బయటకు చెప్పరు. సినిమా విడుదల అయ్యే వరకు సస్పెన్స్‌లో ఉంచుతారు. 


సరోగసీ ప్రెగ్నెంట్‌గా సమంత!
Samantha Plays Surrogacy Pregnant In Yashoda Movie : 'యశోద' టీమ్ కాన్సెప్ట్‌తో పాటు కంటెంట్ మీద కాన్ఫిడెన్స్‌తో ఉంది. సరోగసీ కాన్సెప్ట్ మీద సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సినిమాను రూపొందించారు. స్టార్టింగ్ టు ఎండింగ్ 'యశోద' థ్రిల్ ఇస్తుందని సమాచారం. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్‌లో సమంతను గర్భవతిగా చూపించారు కదా! అది సరోగసీ ప్రెగ్నెన్సీ అన్నమాట. ఈ రోజు విడుదల చేసే ట్రైలర్‌లో సమంత క్యారెక్టర్‌తో పాటు మిగతా క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయనున్నారని టాక్. 


Yashoda Trailer Launch : 'యశోద' ట్రైలర్‌ను తెలుగులో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో 'మహానటి', 'సీతా రామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ విడుదల చేయనున్నారు. సమంత సినిమాకు పాన్ ఇండియా హీరోలు మద్దతుగా నిలబడుతున్నారు. సాయంత్రం 05.36 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. 


Yashoda Release Date : 'యశోద' సినిమాను నవంబర్ 11న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ స్థాయిలో పబ్లిసిటీ కూడా మొదలైంది. అందుకు ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని పాన్ ఇండియా హీరోలతో చేయించడం ఒక ఉదాహరణ.


Also Read : 'ఝాన్సీ' రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?


హరి - హరీష్ దర్శకులుగా పరిచయమవుతున్న 'యశోద' చిత్రంలో సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ప్రధాన తారాగ‌ణం.


ఈ చిత్రానికి  మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.