టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత. వరుసగా విభిన్నమైన సినిమాలు చేయడమే కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తోంది. సమంత రీసెంట్ గా నటిస్తోన్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ‘ది ఫ్యామిలీ మెన్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ లను రూపొందించిన రాజ్ ఆండ్ డికే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. వరుణ్ దావన్, సమంత కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమంతకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


సమంత అనారోగ్యం కారణంగా కొన్నాళ్లు విరామం తీసుకుంది. సుధీర్ఘ కాల విరామం తర్వాత హిందీలో వస్తోన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే ఇటీవల షూటింగ్ సమయంలో భారీ యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ఆమె రెండు చేతులకూ గాయాలు అయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. గాయాల కారణంగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సమంత మళ్లీ ఓ వర్కౌట్ ఫోటోతో కమ్ బ్యాక్ ఇచ్చింది. సమంత ఇటీవల వర్కౌట్ చేస్తున్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ ఫోటోలో సమంత ఎంతో ఫిట్ గా కనిపిస్తుంది. దీంతో ఫ్యాన్స్ ‘సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారా’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 


సమంత గతేడాది మయోసైటిస్ వ్యాధితో చాలా రోజులు బాధపడింది. కొన్ని నెలలపాటు వైద్యం తీసుకుంది. అందుకే చాలా రోజులు షూటింగ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ‘యశోద’ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇబ్బంది రావడంతో ఆ సినిమాను కంప్లీట్ చేయడానికి బెడ్ మీద నుంచే డబ్బింగ్ చెప్పింది సమంత. తర్వాత సమంత ఆరోగ్యం పై రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఇక ఆమె సినిమాలకు దూరం అయిపోవాల్సిందేనని, ఇక సినిమాలకు పనికిరాదని పుకార్లు వచ్చాయి. చాలా రోజుల తర్వాత పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ ముంబైలోని ‘సిటాడెల్’ షూటింగ్ లో పాల్గొంది. ఎన్ని గాయాలైనా అంతకంతకూ స్ట్రాంగ్ అవుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది సమంత.


సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డికేతో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీని తర్వాత విజయ్ దేవరకొండతో కలసి ‘ఖుషి’ సినిమాను పూర్తి చేయనుంది. సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మొన్నీమధ్యే సమంత ‘ఖుషి’ సెట్స్ లో పాల్గొంది. దీనితో పాటు సమంత దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా త్వరలో విడుదల కానుంది.