టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంతల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తుందని.. విషయం కోర్టు వరకు వెళ్లిందని రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలాంటి రూమర్లపై మొన్నామధ్య సమంత కౌంటర్ వేసింది. సమంత ఎన్ని కౌంటర్లు వేస్తున్నా.. మీడియాలో తన విడాకుల ప్రచారం మాత్రం ఆగడంలేదు. తాజాగా మరోసారి ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. 


Also Read : Love Story Update: ‘లవ్ స్టోరీ’ ట్రైలర్: బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవను జాబ్ అడిగితే పొమ్మంటాడట.. డైలాగ్స్ భలే ఉన్నాయ్!


చైతు-సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు చైతు. 'లవ్ స్టోరీ' టీమ్ కి తన విషెస్ చెబుతూ.. చైతు పెట్టిన పోస్ట్ కి రిప్లై ఇస్తూ.. విన్నర్ అంటూ చిత్ర యూనిట్ కి, సాయి పల్లవికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ ట్వీట్ చూసిన అక్కినేని ఫ్యాన్స్.. చైతు-సమంతలు బాగానే ఉన్నారని.. విడాకుల వార్తలు కరెక్ట్ కాదని భావిస్తున్నారు.


అయితే ఈ ట్వీట్ లో సమంత ఎక్కడా చైతు పేరు మాత్రం చెప్పలేదు. దీంతో కొందరు నెటిజన్లు మళ్లీ నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. చైతు మీద కోపంతోనే అతడిని ట్యాగ్ చేయలేదని కొందరు అంటుంటే.. చైతన్య ట్వీట్‌కే   సమంత రిప్లై ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆయన పేరు చెప్పడం ఎందుకని.. మరికొందరు అంటున్నారు. విడాకుల వ్యవహారాన్ని సమంత ఇలా పరోక్షంగా కొట్టిపారేసింది ఇంకొందరు పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి సమంత 'లవ్ స్టోరీ' ట్రైలర్ పై స్పందించి కొంతవరకు రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టిందనే చెప్పాలి.