రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ‘ఖుషి’ ట్రైలర్  విడుదలై, ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.  హైదరాబాద్ లో జరిగిన మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ జోష్ ఫుల్ గా జరిగింది.  విజయ్ దేవరకొండ, సమంతతో పాటు చిత్రబృందం ఈ ఈవెంట్ లో పాల్గొని సందడి చేసింది.  


విజయ్ సీక్రెట్ లీక్ చేసిన సమంత


అటు ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో విజయ్, సమంత వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో విజయ్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్, ఆయనకు భార్య ఎలా ఉండాలి? అనే విషయాల గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్ ఎక్కువ ఏ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతాడు? అనే యాంకర్ ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. తను ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడడని, కేవలం టెక్ట్స్ మాత్రమే చేస్తాడని హింట్ ఇచ్చింది. ఇక విజయ్ కి కాబోయే అమ్మాయి చాలా సింపుల్ గా ఉండాలని చెప్పింది. అతడి ఫ్యామిలీతో ఇట్టే కలిసిపోయే అమ్మాయి అయితే బాగుంటుందని వెల్లడించింది. సమంత చెప్పిన మాటలతో తను ఏకీభవిస్తున్నట్లు విజయ్ చెప్పాడు.


సమంత గురించి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు   


అటు సమంత గురించి విజయ్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సమంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అనే ప్రశ్నకు పలువురు పేర్లు చెప్పారు. వారిలో రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన, మేఘన బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. సమంతకు తినడం అంటే చాలా ఇష్టం అన్నాడు. అన్ని రకాల వంటలను బాగా ఆస్వాదిస్తుందని చెప్పాడు. కోపం వచ్చినా తను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయదని చెప్పాడు. చాలా సంయమనంతో వ్యవహరిస్తోందని వివరించాడు.    


హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్, సమంత, శివ


ఇక హైదరాబాద్ లో రీసెంట్ గా నిర్వహించిన ‘ఖుషి’ మ్యూజిక్‌ కన్సర్ట్‌ బాగా సక్సెస్ అయ్యింది.  స్టేజ్ మీద విజయ్‌, సామ్‌ కలిసి లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. అయితే, విజయ్‌ షర్ట్‌ తీసేసి, సామ్‌ను ఎత్తుకుని తిప్పడంపై విమర్శలు వచ్చాయి. విజయ్, సమంతపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే, ఈ ట్రోలింగ్ పై అటు విజయ్ గానీ, ఇటు సమంత గానీ స్పందించలేదు.  శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ‘లైగర్’తో విజయ్, ‘శాకుంతలం’తో సమంత, ‘టక్ జగదీష్’తో శివ నిర్వాణ ప్లాపులు అందుకున్నారు. ఈ ముగ్గురు కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.


Read Also: 2024లో ఏపీ సీఎం ఆయనే - పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial