తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో వందలాది పాత్రలు పోషించిన ఆయన అటు రాజకీయాల్లోనూ బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక గత కొంతకాలంగా ఆయనకు వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఈ మధ్య కొన్ని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలో కనిపిస్తూ సినీ పరిశ్రమ గురించి, ఈతరం హీరోల గురించి ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి హీరోలపై కోటా శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు ఎంతలా హాట్ టాపిక్ అయ్యాయో చెప్పనవసరం లేదు.


అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినీ విషయాలతో పాటు రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ సీఎం జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు కి రాజకీయాల గురించి ప్రశ్న ఎదురువగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల పరంగా తాను వాజ్‌పేయ్‌కు మంచి అభిమానిని అని ఆయన ప్రభావంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. బీజేపీ తరఫున విజయవాడ నియోజకవర్గంలో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచి మంచి పేరు తెచ్చుకున్నానని, ఆ తర్వాత మనకి రాజకీయాలు పడవని వాటి జోలికి వెళ్లలేదని చెప్పారు.


ఇక తర్వాత ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడిన ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఒలిచిపెట్టిన అరటిపండు ఇస్తాడని, ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆకులు పోగు చేసి విస్తరాకులు కుట్టుకోవాలంటారంటూ కాస్త వెటకారంగా స్పందించారు. ఇక ఓటు వేసిన ప్రజలు నాయకుడి నుంచి ఏం ఆశించి ఓటు వేశారో వాళ్ళకే తెలియాలని.. అప్పుడు ఓటేశారు, ఇప్పుడు అనుభవిస్తున్నారని తెలిపారు.


ఇక ఆ తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి అలాగే జగన్ పాలన గురించి మాట్లాడేందుకు కోటా శ్రీనివాసరావు ముందు నిరాకరించినా.. ఆ తర్వాత ఆంధ్రాలో జరుగుతున్నదంతా జగన్ కి తెలుసని దాని గురించి తాను ఏం మాట్లాడదలచుకోలేదని, కానీ ఒక్క విషయం ఏంటంటే, నిద్రపోయేవాన్ని లేపగలం కానీ నిద్ర నటించే వాడిని లేపలేమంటూ సామెత రూపంలో జగన్ పాలనపై వ్యంగ్యాస్త్రాలు అందించారు కోటా శ్రీనివాసరావు.


దీంతో జగన్ పై కోట శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా గతంలో కూడా ఏపీ రాజకీయాలపై కోట శ్రీనివాసరావు స్పందిస్తూ సీఎం జగన్ అనవసరమైన సమస్యలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక కోట శ్రీనివాసరావు గతంలో బీజేపీ పార్టీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 1999 పోటీ చేసి గెలుపొందారు. 1999 నుంచి 2004 వరకు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఆ తర్వాత మళ్లీ రాజకీయాల జోలికి వెళ్లలేదు.


Also Read : మొన్న విజయ్, నిన్న విశ్వక్ సేన్ - స్టేజ్ మీదే చీర‌ పైట తీసి ఆట, నేహా శెట్టి డ్యాన్స్ వైరల్!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial