టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం తెలుగులో 'ఖుషి', 'యశోద'.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంత తన రెమ్యునరేషన్ పెంచేసిందట. 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అమ్మడు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అలానే 'యశోద', 'శాకుంతలం' సినిమాలకు రూ.2.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా రూ.3.5 కోట్లు డిమాండ్ చేస్తుందట ఈ బ్యూటీ. అంతకంటే తక్కువ ఆఫర్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదట.
'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 తరువాత సమంత క్రేజ్ పెరిగింది. ఓటీటీ, శాటిలైట్ ఛానెల్స్ లో తన సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. అందుకే సమంత రెమ్యునరేషన్ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. సౌత్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అంటే నయనతార అనే చెప్పాలి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సమంత కూడా చేరబోతోంది.
'యశోద' కోసం 'ఫ్యామిలీ మ్యాన్' టీమ్:
సమంత నటిస్తోన్న 'యశోద' సినిమాలో 3 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నారయట. మూడు వేటికవి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. అందులో ఓ యాక్షన్ సీన్ ని 'ఫ్యామిలీ మ్యాన్' టీమ్ కి పని చేసిన ఫారెన్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2కి పని చేసిన యాక్షన్ మాస్టర్లే ఈ సినిమాకి కావాలని సమంత డిమాండ్ చేయడంతో నిర్మాతలు వాళ్లను దిగుమతి చేయాల్సి వచ్చింది. క్లైమాక్స్ కి ముందు ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుందని.. అందులో సమంత పోరాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంది. మరి ఆ యాక్షన్ ఫీట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి!
'ఖుషి' సినిమా చెప్పిన టైంకి రాదా?
కొన్నాళ్లక్రితం విజయ్ దేవరకొండ, సమంత నటిస్తోన్న 'ఖుషి' సినిమాని డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడబోతున్నట్లు సమాచారం. దాని స్థానంలో అఖిల్ 'ఏజెంట్' సినిమా అదే నెల 23న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'ఖుషి' సినిమా ఇంకా బ్యాలెన్స్ ఉంది. షూటింగ్ కొంతభాగమే బ్యాలెన్స్ ఉన్నప్పటిక్కీ.. హడావిడి చేయడం ఇష్టంలేక దాన్ని జనవరి ప్రారంభంలో లేదా రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ విషయాన్ని కన్ఫర్మ్ గా చెప్పనప్పటికీ.. వాయిదా పడడం ఖాయమనిపిస్తుంది.
Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?