సినిమా హీరోలకు బయట ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది అభిమానులు తమ అభిమాన హీరో డ్రెసింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ లను ఫాలో అవుతూ ఉంటారు. వారి లాగా కనిపించాలని ప్రయత్నిస్తూ మురిసిపోతారు. కొంత మంది అభిమానులైతే తమ ఫేవరేట్ హీరో ఏం ధరిస్తున్నారు, ఎందుకు ధరిస్తున్నారు, దాని ధర ఎంత అని ఆరా తీస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన చేతికి ధరించే బ్రాస్లెట్ గురించి అభిమానులు ఎన్నో సార్లు ఆరా తీసారు. కానీ ఆయన ఆ బ్రాస్లెట్ ను ఎందుకు ధరిస్తారో తెలియలేదు. అయితే గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ బ్రాస్లెట్ గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


సల్మాన్ బ్రాస్లెట్ వెనక ఉన్న కథ ఇదే..


సల్మాన్ ఖాన్ తన కుడి చేతికి ఎప్పుడూ ఒక బ్రాస్లెట్ ను ధరిస్తూ ఉంటాడు. సిల్వర్ గొలుసుతో మధ్యలో ఒక అందమైన బ్లూ స్టోన్ తో ఎంతో ఆకట్టుకునేలా ఉంటుందా బ్రాస్లెట్. అయితే సల్మాన్ ఆ బ్రాస్లెట్ ధరించడం వెనక పెద్ద కథే ఉందట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.  గతంలో ఓ వేడుకలో పాల్గొన్న సల్మాన్ ను ఓ అభిమాని ఆ బ్రాస్లెట్ సీక్రెట్ ఏంటని అడిగాడట. దానికి సల్మాన్ బదులిస్తూ.. తాను చిన్నప్పుడు ఆ బ్రాస్లెట్ తో ఆడుకునేవాడట. తర్వాత కొన్నాళ్లకు తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత తన తండ్రి ఆ బ్రాస్లెట్ ను తనకు బహుమతిగా ఇచ్చారట. ఇక అందులో ఉండే బ్లూస్టోన్ తనపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ దానిని ఆ స్టోన్ లాగేసుకుంటుందట. ఏదైనా చెడు ప్రభావం ఉంటే ఆ రాయి దానిని తీసుకుంటుందని, తర్వాత అది పగిలిపోతుందని చెప్పారట. అలా తాను ఇప్పటికీ 7 రాళ్లను మార్చినట్టు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు సల్మాన్. ఆ బ్రాస్లెట్ తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. అందులో ఉండే రాయి పేరు ఫిరోజా రాయి అని చెప్పారు. ప్రపంచంలోని రెండు సజీవ రాళ్లలో ఈ ఫిరోజా రాయి కూడా ఒకటని చెప్పారు. ఇది చాలా అరుదైన రాయని చెప్పుకొచ్చారు సల్మాన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఓటీటీలోకి ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’..


సల్మాన్ ఖాన్ రీసెంట్ గా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 21, 2023న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, భూమిక చావ్లా, రామ్ చరణ్ కీలక పాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ఈ మూవీను నిర్మించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 23 నుంచి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. జీ5 వేదికగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.