Negative PR on Prabhas Salaar: 'సలార్' సక్సెస్ చూసి షారుఖ్ ఖాన్ అభిమానులు, బాలీవుడ్ జనాలు అసూయ పడుతున్నారా? సినిమాకు ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్ళు సాధిస్తోంది. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ప్రభాస్ మీద, 'సలార్' సినిమాపై కొందరు విషం చిమ్మడం స్టార్ట్ చేశారు. 


ఏవండోయ్ ఇది విన్నారా?
'సలార్' సినిమా ఫ్లాప్ అంట!
Salar Flop Show trends on Twitter: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే... 'ఎవరు ఏమనుకుంటే మాకేంటి? మేం చెప్పాలి అనుకున్నది చెబుతాం. అబద్ధాలు ఆడతాం' అన్నట్లు ఉంది కొందరు వ్యవహారం. 'సలార్' సినిమాకు మొదటి రోజు సుమారు రూ. 180 కోట్ల రూపాయల వసూళ్ళు వచ్చాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ రెండు వేలు, నాలుగు వేలు పెట్టి కొన్న అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ టికెట్స్ దొరక్క చాలా మంది ట్రై చేస్తున్నారు.


సినిమాలో లోపాలు లేవని కాదు. కానీ, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను చూపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బాలీవుడ్ జనాలు కొందరు మాత్రం 'సలార్ ఫ్లాప్' అంటున్నారు. 'సలార్' ఫ్లాప్ షో అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తున్నారు.


ప్రభాస్ కంటే చచ్చినోడు నయం!
ఈ కామెంట్ చేసినోళ్లను ఏమనాలి!
ప్రభాస్ కంటే డెడ్ బాడీ (శవం) ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుందని వీడియోలో ఓ ఇద్దరు కూర్చుని కామెంట్ చేశారు. 'వాళ్ళను ఏమనాలి అసలు!' అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో తప్పు లేదు. ఎందుకంటే... దేవా పాత్రను చూడటం కామెంట్ చేసే హిందీ జనాలకు రాదని అనుకోవాలి. ప్రభాస్ చేసినట్లు ఆ ఫైట్స్ ఎవరు చేయగలరు?


Also Read: సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?






మూడు గంటల టార్చర్ 'సలార్'
ఇంకొందరు ఇంకో అడుగు ముందుకు వేసి షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)ను చూసి ప్రభాస్ యాక్టింగ్ నేర్చుకోవాలని కామెంట్ చేశారు. బాలీవుడ్ వీడియో క్రిటిక్ ఒకరు 'సలార్ మూడు గంటల టార్చర్' అంటూ కామెంట్ చేశారు.


Also Readఛాంబర్‌లో 'దిల్' రాజు దగ్గర సంక్రాంతి సినిమాల పంచాయతీ - డుమ్మా కొట్టిన 'హనుమాన్' నిర్మాత






'సలార్ ఫ్లాప్ షో' అంటూ కామెంట్ చేసే చాలా మంది 'డంకీ'ని బ్లాక్ బస్టర్ అంటూ పోస్టుల చేయడంతో కావాలని ప్రభాస్ మీద విషం చిమ్మే ప్రయత్నం జరుగుతోందని తెలుగు ప్రేక్షకులకు అనుమానాలు కలుగుతున్నాయి.  షారుఖ్ ఖాన్ పీఆర్ ఈ పోస్టులు చేస్తుందంటూ ఒకరు ట్వీట్ చేయడం గమనార్హం.


గమనిక: సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రెండ్, కొందరు చేసిన పోస్టులను  పాఠకులకు అందించడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఆయా వ్యక్తులు పోస్టుల్లో పేర్కొన్న అంశాలకు, ఏబీపీ దేశానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ అభిప్రాయాలను ఏబీపీ దేశం అభిప్రాయంగా భావించవద్దని మనవి. దయచేసి గమనించగలరు. 'సలార్' మీద కొందరు చేసిన నెగిటివ్ కామెంట్స్ ఇక్కడ చూడండి.